
భారత్ గొప్ప పని చేసింది
'క్రికెట్ ఆటలో అండర్-19 స్టేజ్ చాలా ముఖ్యం. అవసరమైన క్రమశిక్షణ, జ్ఞానం లాంటివి అక్కడే నేర్చుకోవచ్చు. అండర్-19 ఓ పునాది లాంటిది. పునాదిని సరిగ్గా ఉంటే ఫలితాలు కూడా బాగుంటాయి. భారత్ ఇదే చేసి సక్సెస్ అయింది. రాహుల్ ద్రవిడ్‌ను అండర్-19 కోచ్‌గా నియమించి భారత్ గొప్ప పని చేసింది. ద్రవిడ్ తన అనుభవం, క్రమశిక్షణ కుర్రాళ్లకు నేర్పిస్తున్నాడు. యువ ఆటగాళ్లకు విజ్ఞానం, వ్యూహాలను అందిస్తున్నాడు. ద్రవిడ్ సమక్ష్యంలో ఆడిన ఎందరో జాతీయ జట్టుకు ఆడుతున్నారు. అందుకే మేం శ్రీలంక అండర్-19 కోచ్‌గా ఉండేందుకు మహేళ జయవర్దనేను ఒప్పించేందుకు ప్రయత్నించాం. కానీ విఫలమయ్యాం' అని అరవింద డిసిల్వా పేర్కొన్నారు.

ద్వితీయ శ్రేణిగా భావించొద్దు
భారత్ 'బి' జట్టును పంపించి శ్రీలంక క్రికెట్ పరువు తీసిందన్న లంక మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్ అరవింద డిసిల్వా స్పందించాడు. 'ఇక్కడికి వచ్చిన భారత బృందాన్ని ద్వితీయ శ్రేణిదిగా భావించొద్దు. టీమిండియాలో ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. అన్ని జట్లలాగే ఇదీ మెరుగైందే. వీరిని ఓడించడం సవాలే.
వీరిపై గెలిస్తే.. ఆ ఆత్మవిశ్వాసంతో టీ20 ప్రపంచకప్‌నకు వెళ్లొచ్చు' అని ఆయన అన్నారు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత ప్రధాన జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లగా.. శిఖర్ ధావన్ సారథ్యంలో మరో జట్టు లంకకు వెళ్లింది.
టీమిండియా తరఫున ఆడాలనుంది.. ఒక్క ఛాన్స్ ప్లీజ్! మనసులో మాట భయపెట్టిన భారత క్రికెటర్!!

భవిష్యత్తులో ప్రతి దేశానికీ 2 జట్లు
కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ఏ పర్యటనకు వెళ్లినా.. బయో బబుల్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆటగాళ్లు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. దీనిపై అరవింద డిసిల్వా మాట్లాడుతూ... 'బుడగ జీవితం అన్ని జట్ల ఆటగాళ్లకు కష్టంగా మారింది. వారిపై మానసిక ఒత్తిడి పెరుగుతోంది.
అందుకే భారత్ మాత్రమే కాదు అన్ని జట్లూ ఆటగాళ్లను రొటేట్ చేయాలి. వారి కుటుంబాలతో గడిపేందుకు అవకాశం ఇవ్వాలి. భవిష్యత్తు క్రికెట్లో ఒకే దేశం రెండు జట్లను మోహరించడం సాధారణంగా మారుతుందని నా అభిప్రాయం' అని చెప్పుకొచ్చారు. లంకకు వెళ్లిన బృందానికి రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే.

శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు
ఆతిథ్య శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు భారత్ ఆడనుంది. జూలై 13, 16, 19 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరగనుండగా.. జూలై 22, 24, 27 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగనుంది. కొలొంబోలోని ప్రేమదాస మైదానంలో మ్యాచులు అన్ని జరగనున్నాయి. కఠిన బయో బబుల్ నేపథ్యంలో ఈ సిరీస్‌లు ప్రేక్షకుల్లేకుండానే జరగనున్నాయి. వన్డేలు మధ్యాహ్నం 1.30 గంటలకు, టీ20 రాత్రి 7 గంటలకు మొదలవుతాయి.


Click it and Unblock the Notifications
