Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీకి భారత్‌లో ఉండటం ఇష్టం లేదు: ఆర్‌సీబీ మాజీ ప్లేయర్

టీమిండియా స్టార్ బ్యాటర్, ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారత్‌లో ఉండటం ఇష్టం లేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్, ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ అన్నాడు. ప్రశాంతమైన జీవితాన్ని విరాట్ కోహ్లీ కోరుకుంటున్నాడని, కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపాలనుకుంటున్నాడని చెప్పాడు. దాంతోనే లండన్‌లో సెటిల్ అయ్యాడని తెలిపాడు.

ప్రస్తుతం భారత్‌తో తాను గడుపుతున్న జీవితాన్ని కోహ్లీ పెద్దగా కోరుకోవడం లేదని, అందరి కళ్లూ ఎప్పుడూ తనపైనే ఉండాలని అతను అస్సలు అనుకోడని స్పష్టం చేశాడు. విరాట్ కోహ్లీ చాలా మంచి వ్యక్తి అని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్‌సీబీకి ప్రాతినిథ్యం వహించిన లియామ్ లివింగ్ స్టోన్.. తాజా సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఆడాడు. ఇటీవలే ఐపీఎల్ ముగియడంతో స్వదేశానికి వెళ్లిన లివింగ్ స్టోన్.. అక్కడ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లతో కలిసి ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు.

కోహ్లీ అద్భుతమైన వ్యక్తి..

'విరాట్ కోహ్లీ అద్భుతమైన వ్యక్తి. నేను ఎప్పుడూ అతనికి ప్రత్యర్థిగానే ఆడాను. కోహ్లీ ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తాడు. అతనితో గొడవకు దిగాలనుకుంటే అతను కూడా అదే రీతిలో బదులిస్తాడు. కానీ మైదానంలో మాత్రం అత్యంత పోటీతత్వంతో ఉంటాడు. విరాట్ కోహ్లీ.. బౌండరీ లైన్ దాటి మైదానంలో అడుగుపెట్టగానే భిన్నమైన వ్యక్తిగా మారిపోతాడు. కానీ మైదానం బయట అతను చాలా మంచి వ్యక్తి. చాలా ప్రశాంతంగా ఉంటాడు.

Liam Livingstone Says Virat Kohli Genuinely Nice and Chilled Out Doesn t Crave the Constant Spotlight in India

తన కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ఇష్టపడుతాడు. చాలా ప్రశాంతమైన స్వభావం ఉన్నప్పటికీ.. భారత్‌లో ఉండేందుకు కోహ్లీ ఇష్టపడటం లేదు. ప్రస్తుతం భారత్‌లో అతను గడుపుతున్న జీవితాన్ని కోహ్లీ కోరుకోవడం లేదు. అందరి కళ్లూ ఎప్పుడూ తనపైనే ఉండాలని అతను అస్సలు అనుకోడు. అందుకే లండన్‌లో సెటిల్ అయ్యాడు. అతను నిజంగానే చాలా మంచి వ్యక్తి. మైదానంలో నేను చూసిన ఆటగాళ్లలో అత్యంత పోటీతత్వం కలిగిన ప్లేయర్ విరాట్ కోహ్లీ మాత్రమే.

కోచ్‌ల జోక్యంతో మారిన ఆట..

ఆర్‌సీబీ కోచింగ్ స్టాఫ్ మోబాట్, ఆండీ ఫ్లవర్ విరాట్ కోహ్లీ ఆడే విధానాన్ని మార్చారు. ఈ మార్పు చేయడానికి వారు ఎంతో సాహసం చేశారు. కొంచెం దూకుడుగా ఆడాలని, ఎక్కువ సిక్సర్లు కొట్టాలని కోహ్లీ సూచించాడు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడాలని చెప్పారు. దాంతో కోహ్లీ ఆటతీరు పూర్తిగా మారిపోయింది. గతానికి భిన్నంగా కోహ్లీ దూకుడుగా ఆడుతున్నాడు. స్పిన్ బౌలింగ్‌లోనూ భారీ షాట్స్ ఆడుతున్నాడు.'అని లివింగ్ స్టోన్ చెప్పుకొచ్చాడు.

విరాట్ కోహ్లీ తన కుటుంబంతో లండన్‌లో సెటిల్ అయిన సంగతి తెలిసిందే. తన కొడుకు అకాయ్ కోహ్లీ కూడా అక్కడే జన్మించాడు. విరాట్ కోహ్లీ లండన్ పౌరసత్వం తీసుకోబోతున్నాడనే ప్రచారం కూడా జోరుగా సాగింది. వ్యక్తిగత స్వేచ్ఛ, మీడియా హైప్ నుంచి తన పిల్లలను రక్షించుకునేందుకు విరుష్క దంపతులు లండన్‌ను తమ నివాస స్థలంగా ఎంచుకున్నారు. దాంతోనే వన్డే క్రికెట్, ఐపీఎల్ ఆడే సమయంలో మాత్రమే కోహ్లీ భారత్‌కు వస్తున్నాడు.

Story first published: Friday, June 5, 2026, 15:40 [IST]
Other articles published on Jun 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+