Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Livingstone: క్రికెట్ చరిత్రలోనే భారీ సిక్సర్.. కొడితే నెట్టిళ్లు దద్దరిల్లిపోయిందంతే! (వీడియో)

Liam Livingstone leaves fans gobsmacked with a huge six in 2nd T20I against Pakistan

టెంట్‌ బ్రిడ్జ్‌: పాకిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ లియామ్ లివింగ్ స్టోన్ దుమ్ములేపాడు. అతను కొట్టిన ఓ సిక్సర్‌తో నెట్టిళ్లు దద్దరిల్లుతోంది. అవును ఈ ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ ఏకంగా 125 ప్లస్ మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. అసలు బంతి ఎన్ని మీటర్ల దూరంలో పడిందో కూడా కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. దాంతో ఈ సిక్సర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా దుమ్మురేపుతోంది. పాకిస్థాన్ బౌలర్ హ్యారిస్ రౌఫ్ వేసిన 16వ ఓవర్ తొలి బంతిని లాంగాన్ దిశగా లివింగ్ స్టోన్ భారీ సిక్సర్ బాదాడు.

అతని బలానికి బంతి ఏకంగా మైదానం అవతల రగ్బీ పిచ్‌పై పడింది. దాదాపు ఆ సిక్స్ 125 ప్లస్ మీటర్లంట. ఈ సిక్స్‌ను ప్రపంచంలోనే అత్యంత భారీ సిక్సర్‌గా కామెంటేటర్స్‌తోపాటు అభిమానులు అభివర్ణిస్తున్నారు. 125 + మీటర్ల కంటే ఎక్కువ దూరంలో బంతి పడిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ సిక్స్‌‌ దూరాన్ని కచ్చితంగా చెప్పడం సాధ్యం కాలేదంట. ఇలాంటి సిక్స్‌ను ఇంతవరకు తాము చూడలేదని స్కై స్పోర్ట్స్‌లో కామెంటేటర్లుగా ఉన్న మాజీ క్రికెటర్లు ఇయాన్‌ వార్డ్‌, కుమార సంగక్కర మ్యాచ్‌ అనంతరం చెప్పారు.

ఐసీసీ అధికారిక గణాంకాల ప్రకారం పొడవైన సిక్స్‌ ఆస్ట్రేలియాకు చెందిన బ్రెట్‌లీ పేరిట ఉన్నది. 2005 లో 130-135 మీటర్ల పొడవుతో సిక్స్‌ బాది రికార్డుల్లో స్థానం పొందారు. 2012 లో న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్‌ గుప్తిల్‌ 120-125 మీటర్ల పొడవైన సిక్స్ నమోదు చేశారు. కాగా, అనధికారికంగా 1899 లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు చెందిన అల్బర్ట్‌ ట్రాట్‌ 160 మీటర్లు, 2013 లో పాకిస్తాన్‌కు చెందిన షాహిద్‌ ఆఫ్రిదీ 158 మీటర్ల పొడవుతో సిక్స్‌లు బాదారు.

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ 45 రన్స్ తేడాతో విజయం సాధించింది. దాంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్(59), మొయిన్ అలీ(36), లివింగ్ స్టోన్(38) రాణించారు. అనంతరం పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులే చేసి ఓటమిపాలైంది. మహ్మద్ రిజ్వాన్(37), షాదాబ్ ఖాన్(36) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మొయిన్ అలీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

Story first published: Monday, July 19, 2021, 22:10 [IST]
Other articles published on Jul 19, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+