ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నాలుగేళ్ల క్రితం ఈ ఘటన చోటు చేసుకోగా.. ఫ్యాన్స్ ఈ వీడియోను రీ వైరల్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా నవ్వులు పూయిస్తున్నారు. బిగ్ బాష్ లీగ్ 2020 సీజన్ సందర్భంగా బ్యాటింగ్ చేసే సమయంలో లియామ్ లివింగ్ స్టోన్‌కు బంతి తాకరాని చోట తాకింది.
అది కూడా మూడు సార్లు తాకడంతో లియామ్ లివింగ్ స్టోన్ నొప్పితో విలవిలలాడాడు. నొప్పిని భరించలేక నేలపై కుప్పకూలిన అతను.. ఉపశమనం పొందేందుకు నానాపాట్లు పడ్డాడు. క్రీజులో డాగీ స్టైల్లో పడుకొని ముందుకు వెనక్కి ఊగుతూ నొప్పి నుంచి ఉపశమనం పొందే ప్రయత్నం చేశాడు. ఈ అనూహ్య ఘటన అతనికి తీవ్ర నొప్పిని కలిగిస్తే ఇతరులకు నవ్వులు తెప్పించింది.

కామెంటేటర్లు సైతం సరదా వ్యాఖ్యానంతో నవ్వులు పూయించారు. 'పాపం లివింగ్‌స్టోన్.. ఒకే మ్యాచ్‌లో మూడు సార్లు తాకరాని చోట బంతి తాకింది. ఈ నొప్పి నుంచి ఉపశమనం కలిగించే మ్యాజిక్ స్ప్రేలు కూడా లేవు.'అని నవ్వుకున్నారు. ఆ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా మైక్ హస్సీ కూడా వ్యవహరించాడు. అతను అయితే మరింత దిగజారి కామెంట్స్ చేశాడు.
'అతని ఆకారం ఏమైనా దెబ్బతిన్నదా..? ఏం కావద్దని కోరుకుందాం. ఇది సరదా కాదు. అయినా ఫిజియో వెళ్లి ఏం చేస్తున్నాడు. 'అని జుగుప్సాకరంగా వ్యాఖ్యానించాడు.
పుల్ షాట్స్ ఆడే క్రమంలో బంతిని అంచనా వేయడంలో విఫలమైన లివింగ్ స్టోన్.. ఇలా తన జననేంద్రియంపై తాకిచ్చుకున్నాడు. ఈ వీడియోను క్రికెట్ ఫన్నీ వీడియోగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.
ఆ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన లివింగ్‌స్టోన్.. మెల్‌బోర్న్ రెనిగేడ్స్‌పై హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 39 బంతుల్లో 4 సిక్స్‌లు, 3 ఫోర్లతో 59 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో లివింగ్ స్టోన్ టీమ్ విజయం సాధించింది.