రైతులు దేశంలో అంతర్భాగం
'రైతు ఉద్యమంపై భిన్నాభిప్రాయలు ఉన్నప్పటికీ అందరం ఐకమత్యంగా ఉందాం. రైతులు మన దేశంలో అంతర్భాగం. వారు దేశానికి వెన్నెముక. ఈ సమస్యకు తప్పక పరిష్కారం లభిస్తుందని నేను అనుకుంటున్నాను. దేశంలో శాంతి నెలకొల్పేందుకు అన్ని పార్టీలు కృషి చేస్తాయని ఆశిస్తున్నా' అని విరాట్ కోహ్లీ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. #IndiaTogether అనే హాష్ టాగ్ కూడా విరాట్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. రైతుల ఆందోళనకు అనుకూలంగా విదేశీ సెలబ్రిటీలు వ్యాఖ్యానించడాన్ని దేశంలోని చాలా మంది తప్పుపడుతున్న సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం కూడా ఈ విషయంలో మండిపడింది.
దేశ శ్రేయస్సులో రైతులు ముఖ్యం:
టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రవిశాస్త్రి, భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే, టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా కూడా రైతు ఉద్యమంపై స్పందించారు. 'మనం ఐకమత్యంగా ఉంటే పరిష్కారం దొరకని సమస్య అంటూ ఉండదు. మన అంతర్గత సమస్యను మనమే కలిసికట్టుగా పరిష్కరించుకుందాం' అని జింక్స్ ట్వీట్ చేశాడు. 'మనమందరం కలిసి పరిష్కారం కనుగొంటే భారతదేశం ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది. దేశం యొక్క శ్రేయస్సులో మన రైతులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషిస్తారని అనుకుంటున్నా' అని రోహిత్ అన్నాడు.

కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం:
సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళన పట్ల అమెరికా పాప్ గాయని రిహానా, యువ పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్ సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందించారు. వారు రైతులకు మద్దతు ప్రకటించారు. అయితే వీరిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మా అంతర్గత వ్యవహారాల్లో మీ జోక్యం ఏమిటని మండిపడింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ వాదనలను కొందరు భారత సెలబ్రిటీలు సమర్థించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెట్స్‌లో సుదీర్ఘంగా బ్యాటింగ్ ప్రాక్టీస్:
శుక్రవారం నుంచి చెన్నైలో ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే తొలి టెస్టు కోసం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్య రహానేలు తీవ్రంగా సాధన చేస్తున్నారు. చతేశ్వర్ పుజారా, శుభమన్ గిల్ కూడా నెట్స్‌లో సుదీర్ఘంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఇషాంత్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ సాధన చేశారు. అనంతరం జట్టు సభ్యులంతా కలిసి ఫీల్డింగ్, క్యాచింగ్ ప్రాక్టీస్ చేశారు. వెన్నెముకకు శస్త్రచికిత్స అనంతరం తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేశాడు.


Click it and Unblock the Notifications












