Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LLC: మళ్లీ మైదానంలోకి సెహ్వాగ్, గంభీర్.. కానీ ఈసారి ప్రత్యర్థులుగా ..

Legends League Cricket: Virender Sehwag, Gautam Gambhir to captain Gujarat Giants and India Capitals

న్యూఢిల్లీ: భారత దిగ్గజ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ మరోసారి బ్యాట్ పట్టనున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఏళ్లు గడుస్తున్నా.. లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ ద్వారా అభిమానులను అలరించేందుకు సిద్దమయ్యారు. తాము క్రికెట్ ఆడినప్పుడు ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లను గడగడలాడించిన ఈ ఢిల్లీ బ్యాటర్లు ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ చేయబోతున్నారు. అయితే భారత జట్టు దిగ్గజ ఓపెనింగ్ జోడీగా పేరుగాంచిన ఈ అలానాటి స్టార్ ఆటగాళ్లు.. ఈ సారి సహచరుల్లా కాకుండా ప్రత్యర్థుల్లా బరిలోకి దిగనున్నారు. కేవలం ఆటగాళ్లుగానే గాక ఈసారి సారథులుగా ఆడనున్నారు.

గుజరాత్ కెప్టెన్‌గా సెహ్వాగ్..

గుజరాత్ కెప్టెన్‌గా సెహ్వాగ్..

సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభం కానున్న ఈ లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో మొత్తం నాలుగు జట్లు పోటీపడనున్నాయి. ఇందులో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం గౌతం అదానీకి చెందిన గుజరాత్ జెయింట్స్ జట్టుకు వీరేంద్ర సెహ్వాగ్ సారథ్యం వహించనున్నాడు. జీఎమ్‌ఆర్ గ్రూప్‌కు చెందిన ఇండియా క్యాపిటల్స్ జట్టును గౌతమ్ గంభీర్ నడిపించనున్నాడు. గతంలో ఐపీఎల్‌లో ప్రత్యర్థుల్లా తలపడ్డా సెహ్వాగ్-గంభీర్.. మళ్లీ ఇన్నాళ్లకు ఒకరికొకరు పోటీపడనున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన జీఎమ్‌ఆర్ గ్రూప్‌కు ఐపీఎల్‌లోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కూడా వాటా ఉంది.

ఉత్సాహంగా ఉన్నాం..

ఉత్సాహంగా ఉన్నాం..

ఇక తాజాగా లెజెండ్స్ లీగ్‌పై సెహ్వాగ్ స్పందించాడు. మళ్లీ మైదానంలోకి బరిలోకి దిగడం సంతోషంగా ఉందన్నాడు. 'నేను ఈ సీజన్ కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. చాలాకాలం తర్వాత తిరిగి గ్రౌండ్ లోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉంది.. మా పూర్తి జట్టును త్వరలోనే ప్రకటిస్తాం.'అని పేర్కొన్నాడు. గంభీర్ మాట్లాడుతూ.. 'క్రికెట్ ఎప్పుడూ జట్టుగా ఆడే ఆట. కెప్టెన్ ఆ బృందాన్ని సరైన క్రమంలో నడిపించాలి. ఇండియా క్యాపిటల్స్ జట్టుకు సారథిగా నియమితుడైనందుకు ఆనందంగా ఉంది. లెజెండ్స్ లీగ్ క్రికెట్ మంచి విజయం సాధించాలి. సీజన్ ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.'అని తెలిపాడు.

సెప్టెంబర్ 17 నుంచి షురూ

సెప్టెంబర్ 17 నుంచి షురూ

సెప్టెంబర్ 17 నుంచి లెజెండ్స్ లీగ్ రెండో సీజన్‌కు తెరలేవనుంది. ఈ సీజన్‌ ప్రారంభానికి ఒక్క రోజు ముందు చారిటీ మ్యాచ్ జరగనుంది. ఇండియా మహారాజాస్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్ జట్లు ఫండ్ రైజింగ్ కోసం తలపడనున్నాయి. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా బీసీసీఐ ఈ మ్యాచ్ ను నిర్వహిస్తున్నది. భారత జట్టుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. వరల్డ్ జెయింట్స్ కు ఇయాన్ మోర్గాన్ సారథులుగా ఉన్నారు.

ఫండ్ రైజింగ్ మ్యాచ్

ఫండ్ రైజింగ్ మ్యాచ్

ఈ మ్యాచ్ ద్వారా సేకరించిన నిధులను కపిల్ దేవ్‌కు చెందిన ఖుషి స్వచ్చంద సంస్థకు అందజేయనున్నారు. దేశంలోని బాలికలకు చదువు అందించేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది. టీ20 ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరగనుండగా.. లక్నో, న్యూఢిల్లీ, జోధ్‌పూర్, కటక్, కోల్కతా వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. సెప్టెంబర్ 16న మొదలయ్యే ఈ టోర్నీ.. అక్టోబర్ 8న ముగియనుంది. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ఈ మ్యాచ్‌లు ప్రసారం కానున్నాయి.

Story first published: Thursday, September 1, 2022, 21:02 [IST]
Other articles published on Sep 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+