Legends League Cricket: ఇమ్రాన్ తాహిర్ సిక్సర్ల విధ్వంసం.. ఇండియా మహరాజాస్‌కు తప్పని ఓటమి!

అల్ అమెరట్: సీనియర్ క్రికెటర్లతో జరుగుతున్న లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో ఇండియా మహరాజస్ టీమ్‌కు షాక్ తగిలింది. వరల్డ్ గెయింట్స్ టీమ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో మహరాజస్ టీమ్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా దిగ్గజ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్(19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 52 నాటౌట్) అనూహ్యంగా చెలరేగడంతో వరల్డ్ గెయింట్స్ టీమ్ అద్భుత విజయాన్నందుకుంది. దాదాపు విజయం ఖాయమనుకున్న మహరాజస్ చివరి ఓవర్లలో ధారళంగా పరుగులిచ్చి మూల్యం చెల్లించుకుంది.
క్యాచ్ నేలపాలు చేసి..
ఇమ్రాన్ తాహిర్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను మునాఫ్ పటేల్ వదిలేయడం మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియ మహరాజస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఇండియా మహరాజస్ టీమ్‌లో నమాన్ ఓజా(69 బంతుల్లో 15 ఫోర్లు, 9 సిక్సర్లతో 140) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ మహమ్మద్ కైఫ్(47 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. వరల్డ్ గెయింట్స్ టీమ్‌లో ర్యాన్ రెండు వికెట్లు తీయగా.. మోర్నీ మోర్కెల్ ఓ వికెట్ పడగొట్టాడు.
ఇమ్రాన్ విధ్వంసం..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన వరల్డ్ గెయింట్స్ 19.3 ఓవర్లలోనే 7 వికెట్లకు 210 పరుగులు చేసి మరో మూడు బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. ఆ జట్టులో కెవిన్ పీటర్సన్(27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 53), ఇమ్రాన్ తాహిర్ హాఫ్ సెంచరీలతో మెరిసారు. మహరాజ బౌలర్లలో మునాఫ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ రెండేసి వికెట్లు తీయగా.. మన్‌ప్రీత్ గోన్, హెమాంగ్ బాదాని ఓ వికెట్ పడగొట్టాడు. మహరాజ్ బౌలర్ల ధాటికి 160 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన వరల్డ్ గెయింట్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
గెలిచే మ్యాచ్‌లో..
మహరాజ టీమ్ విజయం ఖాయమని అంతా భావించారు. కానీ క్రీజులోకి వచ్చిన ఇమ్రాన్ తాహిర్ అనూహ్యంగా చెలరేగాడు. సిక్సర్లతో పరుగుల విధ్వంస సృష్టించాడు. డారెన్ సామీ ఔటైన వెంటనే క్రీజులోకి వచ్చిన తాహీర్.. వచ్చి రావడంతోనే మునాఫ్ పటేల్ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు.ఇక గోనీ వేసిన 18వ ఓవర్‌లో మూడు సిక్సర్లు బాది 23 పరుగులు పిండుకున్నాడు. మునాఫ్ పటేల్ వేసిన 19వ ఓవర్‌లో రెండు బౌండరీలు బాదిన తాహీర్.. వేణుగోపాల్ రావు వేసిన చివరి ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాది వరల్డ్ గెయింట్స్ విజయ లాంచనాన్ని పూర్తి చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications