Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Legends League Cricket 2022: ఆ ఐదు నగరాల్లో అలనాటి ఆటగాళ్ల మ్యాచ్‌లు.. పూర్తి షెడ్యూల్ ఇదే!

Legends League Cricket 2022: 5 Cities In India To Host Matches, Schedule Announced

హైదరాబాద్. సచిన్ కళాత్మక కవర్‌ డ్రైవ్‌లు... సెహ్వాగ్‌ అప్పర్‌ కట్‌ షాట్లు.. పఠాన్ సూపర్ స్వింగర్లు.. వాయువేగంతో దూసుకెళ్లే జహీర్, అగార్కర్ బంతులు.. పక్షిలా ఎగిరి బంతిని అందుకునే మహ్మద్ కైఫ్ ఫీల్డింగ్‌ మెరుపులు.. ఇవన్నీ మధుర జ్ఞాపకాలు..! అభిమానుల మదిలో చెరగని ముద్రవేసిన ఇలాంటి అపురూప దృశ్యాలు మరోసారి కళ్ల ముందు సాక్షాత్కారం కానున్నాయి..! క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహామహులు మరోసారి మైదానంలో తలపడేందుకు సిద్ధమయ్యారు...!

వయసు మీద పడ్డా రెట్టించిన ఉత్సాహంతో పోటీకి సై అననున్నారు..! టెస్టులు, వన్డేల్లో తమ ఆటతో క్రికెట్‌కే వన్నె తెచ్చిన ఆటగాళ్లు.. పొట్టి ఫార్మాట్‌లో పోటీ పడనున్నారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్‌ఎల్‌సీ) రెండో సీజన్‌తో అభిమానులను అలరించేందుకు సిద్దమవుతున్నారు. ఈ టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను టోర్నీ నిర్వాహకులు మంగళవారం విడుదల చేశారు.

ఆరు నగరాల్లో..

ఆరు నగరాల్లో..

ఈ టోర్నీ దేశవ్యాప్తంగా ఐదు నగరాల్లో జరగనుంది. లీగ్‌ మ్యాచ్‌లు కోల్‌కతా, న్యూఢిల్లీ, కటక్‌, లక్నో, జోధ్‌పూర్ వేదికగా జరగనున్నాయి. అయితే ప్లేఆఫ్‌ వేదికలు ఇంకా ఖారారు కాలేదు. కాగా టోర్నమెంట్‌ ఓ ప్రత్యేకమైన మ్యాచ్‌తో ఆరంభం కానుంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఇండియా మహరాజాస్‌, వరల్డ్‌ జెయింట్స్‌ మధ్య సెప్టెంబర్ 16న ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఓ చారటీ మ్యాచ్‌ జరగనుంది.

ఇండియా మహరాజాస్‌ జట్టుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సారథ్యం వహించనుండగా.. రెస్టాఫ్ వరల్డ్‌ జెయింట్స్‌ను ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ నడిపించనున్నాడు. అనంతరం సెప్టెంబర్ 17 నుంచి అసలైన టోర్నీ ప్రారంభం కానుంది. కాగా ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు తలపడనున్నాయి.

ఇండియా మహరాజాస్‌ జట్టు

ఇండియా మహరాజాస్‌ జట్టు

సౌరవ్‌ గంగూలీ(కెప్టెన్‌), వీరేంద్ర సెహ్వాగ్‌, మహ్మద్‌ కైఫ్‌,యూసఫ్‌ పఠాన్‌, సుబ్రహ్మణ్యం బద్రీనాథ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, పార్థివ్‌ పటేల్‌(వికెట్‌ కీపర్‌), స్టువర్ట్‌ బిన్నీ, ఎస్‌ శ్రీశాంత్‌, హర్భజన్‌ సింగ్‌, నమన్‌ ఓజా(వికెట్‌ కీపర్‌), అక్షశ్‌ దిండా, ప్రజ్ఞాన్‌ ఓజా, అజయ్‌ జడేజా, ఆర్పీ సింగ్‌, జోగీందర్‌ శర్మ, రితేందర్‌ సింగ్‌ సోధి.

లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 పూర్తి షెడ్యూల్‌

లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 పూర్తి షెడ్యూల్‌

కోల్‌కతా(ఈడెన్‌ గార్డెన్స్‌): సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు

లక్నో: సెప్టెంబర్ 21 నుంచి 22 వరకు

న్యూఢిల్లీ: సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు

కటక్(బారాబతి స్టేడియం): 2022 సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు

జోధ్‌పూర్: అక్టోబర్1 నుంచి 3 వరకు

ప్లే-ఆఫ్‌లు: అక్టోబర్ 5 నుంచి 7 వరకు(వేదిక ఇంకా ఖారారు కాలేదు)

ఫైనల్‌: అక్టోబర్ 8(వేదిక ఇంకా ఖారారు కాలేదు)

Story first published: Tuesday, August 23, 2022, 22:51 [IST]
Other articles published on Aug 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+