న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిక్సర్లతో బెంబేలెత్తించిన మాక్స్‌వెల్‌.. భారీ టార్గెట్‌ ఛేదించిన ఆసీస్‌.. వ‌న్డే సిరీస్‌ సొంతం!!

England vs Australia: Glenn Maxwell hit Century as Australia Clinch ODI Series Win Over England

మాంచెస్టర్‌: ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియా పర్యటన ముగిసింది. మూడు టీ20ల సిరీస్‌ని 1-2తో కోల్పోయిన ఆస్ట్రేలియా.. మూడు వన్డేల సిరీస్‌ని మాత్రం 2-1తో కైవసం చేసుకుని ప్రతీకారం తీర్చుకుంది. అంతేకాదు ఇంగ్లండ్‌కు 2015 తర్వాత సొంతగడ్డపై సిరీస్‌ ఓటమి రుచి చూపించింది. ఓల్డ్ ట్రాఫ‌ర్డ్‌ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా థ్రిల్లింగ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. 73 పరుగులకే కీలక 5 వికెట్లు కోల్పోయి విజయం కష్టమే అనుకున్న సమయంలో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (108; 90 బంతుల్లో 4×4, 7×6), అలెక్స్‌ కేరీ (106; 114 బంతుల్లో 7×4, 2×6)లు అద్భుత పోరాటం చేయడంతో ఆసీస్ గట్టెకింది.

తొలి రెండు బంతులకు 2 వికెట్లు

తొలి రెండు బంతులకు 2 వికెట్లు

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆదిలోనే ఇంగ్లీష్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఓపెనర్ జేసన్ రాయ్ (0), జో రూట్ (0)లను ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ మొదటి ఓవర్‌ తొలి రెండు బంతుల్లోనే గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌ చేర్చాడు. అయితే మరో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (112: 126 బంతుల్లో 12x4, 2x6) పట్టుదలతో క్రీజులో నిలబడ్డాడు. అతనికి ఇయాన్ మోర్గాన్ (23) అండగా నిలిచాడు. ఇక జోస్ బట్లర్ (8) అంచనాల్ని అందుకోలేకపోయారు.

బెయిర్‌స్టో సెంచరీ

బెయిర్‌స్టో సెంచరీ

ఒకవైపు వికెట్లు పడుతున్నా.. జానీ బెయిర్‌స్టో మాత్రం పరుగులు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో బెయిర్‌స్టో సెంచరీ బాదాడు. అతనికి శామ్ బిల్లింగ్స్ (57: 58 బంతుల్లో 4x4, 2x6) మంచి సహకారం అందించాడు. ఆపై బిల్లింగ్స్, క్రిస్ ‌వోక్స్ (53 నాటౌట్: 39 బంతుల్లో 6x4) హాఫ్ సెంచరీలు బాదడంతో ఇంగ్లీష్ జట్టు కోలుకుంది. చివరలో ఆదిల్ రషీద్ (11), టామ్ కర్రన్ (19 చెరో సిక్స్ బాదడంతో ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా చెరో మూడు వికెట్లు తీశారు.

73 పరుగులకే ఆసీస్ ఐదు వికెట్లు

73 పరుగులకే ఆసీస్ ఐదు వికెట్లు

లక్ష్య ఛేదనలో ఆసీస్‌కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 21 వద్దే ఓపెనర్ ఆరోన్ ఫించ్‌ (12) క్రిస్ వోక్స్‌ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. రూట్, వోక్స్‌ చెలరేగడంతో డేవిడ్‌ వార్నర్‌ (24), మార్కస్ స్టొయినిస్‌ (4), మార్నస్ లబుషేన్‌ (20), మిచెల్‌ మార్ష్‌ (2) వెంటవెంటనే వెనుదిరిగారు. దీంతో 73 పరుగులకే ఆసీస్ ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక ఆసీస్‌కు గెలుపు అసాధ్యమే అనుకున్నారు. సిరీస్ పోయిందని ఓ అంచనాకు వచ్చారు.

బాదుడే పనిగా పెట్టుకున్న మాక్సీ

బాదుడే పనిగా పెట్టుకున్న మాక్సీ

ఈ క్రమంలో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ క్రీజులోకి దిగాడు. అలెక్స్‌ కేరీతో కలిసి సమయోచితంగా ఆడాడు. కేరీ నిలకడగా ఆడగా.. మాక్సీ మాత్రం బాదుడే పనిగా పెట్టుకున్నాడు. ఒకానొక సమయంలో సిక్సర్లతో బెంబేలెత్తించాడు. 48 బంతుల్లో హాఫ్ సెంచరీ, 84 బంతుల్లో సెంచరీ బాదేశాడు. మరోవైపు కేరీ ఆచితూచి ఆడుతూ శతకం బాదాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు ఏకంగా‌ 212 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ఆసీస్ రేసులోకి వచ్చారు. జట్టు స్కోరు 285 వద్ద మాక్సీ‌, 293 వద్ద కేరీ వెనుదిరిగారు. కమిన్స్‌ (4), స్టార్క్‌ (11) పరుగులు చేయడంతో 303 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలుండగానే ఛేదించింది.

Kolkata Knight Riders‌ జట్టుకు ఒలింపిక్ స్ప్రింటర్ ఎలా సాయపడుతున్నాడంటే!!

Story first published: Thursday, September 17, 2020, 13:46 [IST]
Other articles published on Sep 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X