బ్రేకింగ్ న్యూస్.. క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌కు గుండెపోటు!

న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ గుండెపోటు గురయ్యారు. దాంతో ఆయనను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కపిల్‌కు వైద్యులు యాంజియోప్లాస్టీ సర్జరీ చేసినట్లు సమాచారం. అయితే అతని ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియల్సి ఉంది. గతకొంత కాలంగా కపిల్ డయాబెటిస్, ఇతర అనుబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2020 సీజన్‌ను యాక్టివ్‌గా ఫాలోఅవుతూ.. తన అభిప్రాయాలు వెల్లడిస్తున్న కపిల్ దేవ్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడనే వార్తలు అభిమానులను కలవరపాటుకు గురిచేశాయి. కపిల్ త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖలు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తున్నారు. అటు అభిమానులు కూడా ఈ హర్యానా హరికేన్ త్వరగా కోలుకోవాలంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
కొద్ది రోజుల క్రితం ఢిల్లీ గోల్ఫ్ క్లబ్‌లో కపిల్ దేవ్ ఆడుతుండగా చూశానని ఇదివరకు దౌత్యవేత్తగా పని చేసిన క్రిషన్ చందర్ సింగ్ తెలిపారు. కపిల్ చాలా బరువు తగ్గారన్నారు. డయాబెటిస్ సంబంధ ఆరోగ్య సమస్యలు ఉన్నాయని కపిల్ తనకు చెప్పారని చందర్ సింగ్ పేర్కొన్నారు. కపిల్ దేవ్ త్వరగా కోలుకోవాలని ఆయన దేవుడిని కోరుకున్నారు.
ప్రపంచ దిగ్గజ ఆల్‌రౌండర్‌లో ఒకరైన కపిల్ దేవ్ సారథ్యంలో టీమిండియా 1983 వన్డే ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే. 1983 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై కపిల్ సాధించిన 175 పరుగులు ఇప్పటికే సుపరిచితమే. కపిల్ స్ఫూర్తితో ఎంతో మంది యువుకులు క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపారు. 16 ఏళ్లపాటు టీమిండియా తరఫున ఆడిన కపిల్ దేవ్.. 131 టెస్టులు, 225 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 5248 రన్స్, 434 వికెట్లు.. వన్డేల్లో 3783 పరుగులు, 253 వికెట్లు తీశారు. 9 సెంచరీలు కూడా చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications