న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాట్స్‌మన్ అతనే: అనిల్ కుంబ్లే

Legendary Indian cricketer Anil Kumble names best batsman he has bowled to

బెంగళూరు: 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాట్స్‌మన్ వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అని భారత లెజండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తెలిపాడు. లారాకు బౌలింగ్ చేయడం చాలా కష్టమని చెప్పిన ఈ భారత మాజీ కెప్టెన్.. విండీస్ వీరుడు ఒక్క బంతికి నాలుగు విభిన్నమైన షాట్లు ఆడేవాడని తెలిపాడు. జింబాబ్వే మాజీ క్రికెటర్ పొమ్మి ఎంబాగ్వతో ఇన్‌స్టా లైవ్ సెషన్‌లో పాల్గొన్న కుంబ్లే పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఈ సందర్భంగా తన టఫెస్ట్ బ్యాట్స్‌మన్ ఎవరని ప్రశ్నించగా.. కుంబ్లే విండీస్ ఆటగాడి పేరును సూచించాడు. 'నేను ఎదుర్కొన్న బ్యాట్స్‌మెన్‌లో చాలా మంది కఠినమైన ఆటగాళ్లున్నారు. వారందరిలో బ్రియాన్ లారా టాప్. అతను ఒక్క బంతిని నాలుగు వేర్వేరు షాట్స్ ఆడేవాడు. అతని ఔట్ చేద్దామని, ఇబ్బంది పెడ్దామని అనుకుంటామో.. అప్పుడు అతను ఊహకందని షాట్ ఆడుతాడు. అతని విభిన్నమైన షాట్లు సవాల్‌తో కూడుకున్నవి'అని కుంబ్లే చెప్పుకొచ్చాడు.

ఇక ఈ ఇద్దరు 14 టెస్ట్‌మ్యాచ్‌ల్లో తలపడగా..లారాను కుంబ్లే ఐదు సార్లు ఔట్ చేశాడు. ఇందులో 2002లో అంటిగ్వా వేదికగా జరిగిన టెస్ట్‌లో గాయంతోనే కుంబ్లే బౌలింగ్ చేసి లారాను ఔట్ చేయడం అతని కెరీర్‌లో హైలైట్. ఇక లారా విండీస్ తరఫున 131 టెస్ట్‌లు ఆడి 11953, 299 వన్డేల్లో 10405 రన్స్ చేశాడు.

ఇక సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ టీమ్స్ కావడం తన అదృష్టమని కుంబ్లే పేర్కొన్నాడు. 'విధ్వంసకర ఆటగాళ్లంతా నా సహచరులే కావడం నా అదృష్టం. ఈ ఆటగాళ్లందరికి కేవలం నెట్స్‌లో మాత్రమే బౌలింగ్ చేసా.'అని కుంబ్లే తెలిపాడు. భారత్ తరఫున 132 టెస్ట్‌లు, 272 వన్డేలు ఆడిన కుంబ్లే రెండు ఫార్మాట్లలో కలిపి 956 వికెట్లు తీసాడు. ఇక 2007-2008 వరకు భారత జట్టుకు సారథ్యం కూడా వహించాడు.

అక్తర్ తప్పబ్బా.. ఐపీఎల్ కోసం ప్రపంచకప్ వాయిదా పడలేదు : పాక్ మాజీ క్రికెటర్అక్తర్ తప్పబ్బా.. ఐపీఎల్ కోసం ప్రపంచకప్ వాయిదా పడలేదు : పాక్ మాజీ క్రికెటర్

Story first published: Thursday, July 23, 2020, 22:12 [IST]
Other articles published on Jul 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X