Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హెచ్‌సీఏకి బిగ్ షాక్.. టీజీ20 లీగ్‌కు భారీ అడ్డంకి!

తెలంగాణ టీ20(TG20) ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించేందుకు సిద్దమైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు బిగ్ షాక్ తగిలింది. టీజీ20 లీగ్‌ను అడ్డుకోవాలంటూ పలువురు తెలంగాణ క్రికెటర్లు హైకోర్టును ఆశ్రయించారు.

హెచ్‌సీఏ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్ తమను మోసం చేసిందని పిటిషన్ వేసారు. హెచ్‌సీఏ నిర్వహిస్తున్న ఈ టీజీ20 లీగ్‌కు చట్టబద్దత లేదని, తమకు న్యాయం చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

లోకాయుక్త కీలక ఆదేశాలు..

ఇదిలా ఉండగా.. హెచ్‌సీఏపై వచ్చిన ఫిర్యాదులపై నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాలని తెలంగాణ సీఐడీని లోకాయుక్త ఆదేశించింది. హెచ్‌సీఏపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) చేసిన ఫిర్యాదులపై నాలుగు వారాల్లో చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలని తెలిపింది. గత 15 ఏళ్లుగా హెచ్‌సీఏలో 600 కోట్ల అవినీతి జరిగిందని టీసీఏ ఆరోపించింది. 18 జీహెచ్‌ఎమ్‌సీ క్లబ్స్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నారని, మంత్రి వివేక్ కంపెనీ విశాఖకు హెచ్‌సీఏ నుంచి అక్రమంగా రూ. 69 కోట్లు బదిలీ చేశారని లోకాయుక్తకు టీసీఏ ఫిర్యాదు చేసింది.

చిక్కుల్లో సిరాజ్, తిలక్ వర్మ

చిక్కుల్లో సిరాజ్, తిలక్ వర్మ

అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా హెచ్‌సీఏలో రెండో బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి టీజీ20 లీగ్ నిర్వహిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొంది. 2025‌లో నమోదు ఆయిన కేసులో 8 మంది నిందితుల్లో నలుగురిని అరెస్ట్ చేసి మరో నలుగురిని వదిలేసిన అంశాన్ని కూడా లోకాయుక్త దృష్టికి టీసీఏ తీసుకొచ్చింది. నిబంధనలకు విరుద్దంగా నియమించిన టీజీ20 లీగ్‌ గవర్నింగ్ కౌన్సిల్‌ను రద్దు చేయాలని ఫిర్యాదు చేసింది.

Legal Hurdle for TG T20 League 2026 Telangana Cricketers File High Court Petition Against HCA

సిరాజ్, తిలక్ వర్మకు లీగల్ నోటీసులు

టీమిండియా స్టార్ క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మలతో పాటు అంబటి రాయుడు, టాలీవుడ్ స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ, విక్టరీ వెంకటేష్‌లకు టీసీఏ లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. బీసీసీఐ అనుమతిలేని టీజీ టీ20 లీగ్‌కు ప్రచారం కల్పిస్తున్నారనే ఆరోపణలతో ఈ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని టీసీఏ జ‌న‌ర‌ల్ సెక్రటరీ గుర‌వా రెడ్డి మీడియాకు తెలిపారు.

టీజీ20 లీగ్‌ నిర్వహణపై నీలినీడలు..

తెలంగాణలో యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా హెచ్‌సీఏ నిర్వహించాలనుకున్న టీజీ20 లీగ్‌ 2026‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. టీసీఏ ఆరోపణలు, ఫిర్యాదులతో హెచ్‌సీఏ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అయితే జూన్ 21 నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ టోర్నీ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ టోర్నీలో 8 జట్లు ఇతర టీమ్స్‌తో ఒక్కో మ్యాచ్ ఆడనున్నాయి.

లీగ్ దశ ముగిసే సరికి టాప్-4లో నిలిచిన టీమ్స్ ప్లే ఆఫ్స్ ఆడుతాయి. జులై 11న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. పాలమూరు స్ట్రైకర్, అన్విత ఖమ్మం ఏసెస్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. విజేత జట్టుకు రూ. కోటి నగదు బహుమతి, రన్నరప్‌గా నిలిచిన టీమ్‌కు రూ.50 లక్షలు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.25 లక్షల చొప్పున ప్రైజ్‌మనీని అందజేయనున్నారు.

TG T20 League: రూ.50కే ఉప్పల్ మ్యాచ్ టికెట్స్.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ!

TG T20 League: రూ.50కే ఉప్పల్ మ్యాచ్ టికెట్స్.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ!
Story first published: Friday, June 19, 2026, 18:25 [IST]
Other articles published on Jun 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+