Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2026 Auction: రూ. 1 కోటి 10 లక్షలు పలికిన ప్రపంచకప్ వారియర్!

వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) మెగా వేలంలో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ రికార్డ్ ధరను సొంతం చేసుకుంది. దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా గురువారం జరిగిన మెగా వేలంలో ఈ సౌతాఫ్రికా ప్లేయర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.10 కోట్లకు దక్కించుకుంది. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన లారా వోల్వార్డ్ట్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు, ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.10 కోట్లకు సొంతం చేసుకుంది.

2023లో డబ్ల్యూపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన లారా వోల్వార్డ్ట్ గుజరాత్ టైటాన్స్ తరఫున ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడి 125.74 స్ట్రైక్‌రేట్‌తో 342 పరుగులు చేసింది. 2023లో బెత్ మూనీ గాయపడటంతో జట్టులోకి వచ్చిన లారా వోల్వార్డ్ట్‌కు తుది జట్టులో ఎక్కువ అవకాశాలు దక్కలేదు. రూ. 30 లక్షల కనీస ధరతోనే ఆమె మూడు సీజన్ల పాటు ఆడింది. డబ్ల్యూపీఎల్‌లో పెద్దగా ప్రభావం చూపకపోయినా.. మహిళల వన్డే ప్రపంచకప్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చింది.

Laura Wolvaardt Sold for a Record 1 10 Crore to Delhi Capitals at WPL 2026 Auction

ముఖ్యంగా భారత్‌తో జరిగిన ఫైనల్లో సెంచరీతో ఒంటరి పోరాటం చేసింది. ఈ మెగా టోర్నీలో 571 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ ప్రదర్శన నేపథ్యంలోనే లారాను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి కనబర్చాయి. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను దక్కించుకుంది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్లో సౌతాఫ్రికా ఓడినా.. లారా వోల్వార్డ్ట్ ఒంటరి పోరాటం క్రికెట్ అభిమానులను కట్టిపడేసింది. బౌండరీ లైన్‌పై అమన్‌జోత్ కౌర్ అద్భుత క్యాచ్‌తో ఆమె వెనుదిరిగింది.

Story first published: Thursday, November 27, 2025, 17:10 [IST]
Other articles published on Nov 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+