PBKS vs RR: దురదృష్టవశాత్తూ మ్యాచ్ చివరి ఓవర్ వరకూ వెళ్లింది.. ఆ రెండు బంతులు లాటరీ లాంటివే: కుంబ్లే

దుబాయ్: 19వ ఓవర్లోనే ముగించాల్సిన మ్యాచ్.. దురదృష్టవశాత్తూ చివరి ఓవర్ వరకూ వెళ్లిందని పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే అన్నాడు. ముఖ్యంగా చివరి రెండు బంతులు లాటరీ లాంటివే అని పేర్కొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో స్వల్ప తేడాలతో ఓటమిపాలవ్వడం పంజాబ్‌కు ఓ అలవాటుగా మారిందని జంబో విచారం వ్యక్తం చేశాడు.
మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ రెండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చివరి ఓవర్లో పంజాబ్ విజయానికి 4 పరుగులు అవసరం కాగా.. కార్తీక్ త్యాగి ఒక పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో కచ్చితంగా తమదే గెలుపు అనుకున్న కింగ్స్‌కు నిరాశే ఎదురైంది.

చివరి ఓవర్లో 4 పరుగులు
ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 4 పరుగులు కావాల్సి ఉండగా మ్యాచ్ కచ్చితంగా కింగ్స్ పంజాబ్‌దే అనిపించింది. కానీ రాజస్థాన్ రాయల్స్ పేసర్ కార్తిక్ త్యాగి మాయ చేశాడు. మొదటి బంతిని డాట్ బాల్‌గా వేయగా.. రెండో బంతికి ఐడెన్ మార్క్రామ్ సింగల్ తీశాడు. మూడో బంతికి నికోలస్ పూరన్ ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన హిట్టర్ దీపక్ హుడా (0) నాలుగో బంతికే పరుగులేమి చేయలేదు. ఇక ఐదో బంతికి డకౌటయ్యాడు. దీంతో ఒక బంతికి మూడు పరుగుల చేయాల్సిన దశలో క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్.. ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. దీంతో రాజస్థాన్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఓ అలవాటుగా మారింది
మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే మాట్లాడుతూ... 'స్వల్ప తేడాలతో ఓడిపోవడం మాకు ఓ అలవాటుగా మారింది. ముఖ్యంగా దుబాయ్ స్డేడియానికి వచ్చేసరికి ఇలా జరుగుతోందని నాకు అనిపిస్తోంది. మ్యాచ్‌ను 19 ఓవర్లలో ముగించాలని అనుకున్నాం. అందుకు స్పష్టమైన సంకేతాలు కూడా ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తూ మ్యాచ్ చివరి ఓవర్ వరకూ వెళ్లింది. చివర్లో కొన్ని బంతులే మిగిలి ఉండటంతో.. మ్యాచ్ గెలవడం అనేది ఓ లాటరీలా మారిపోయింది.ముఖ్యంగా చివరి రెండు బంతులు లాటరీ లాంటివే' అని అన్నాడు.

17వ ఓవర్ వరకూ బాగానే ఆడాం
'చివరి ఓవర్‌లో బౌలింగ్ చేసిన కార్తీక్ త్యాగిని కచ్చితంగా మెచ్చుకోవాలి. అతడు ఆఫ్ స్టంప్‌కు ఆవల బంతులేసినా.. మా బ్యాట్స్‌మెన్ ఆడలేకపోయారు. ఈ ఓటములపై దృష్టి సారించాలి. మాకింకా ఐదు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. కానీ ఇలాంటి ఫలితాలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ప్లే ఆఫ్ లక్ష్యంగా ఆడుతాం. టాప్-4కు చేరుకుంటాం' అని అనిల్ కుంబ్లే ధీమా వ్యక్తం చేశాడు.
'ఇది మంచి బ్యాటింగ్ పిచ్. ఒకానొక సమయంలో రాజస్థాన్ 200-210 పరుగులు చేసేలా కనిపించింది. కానీ చివరి నాలుగు ఓవర్లలో మా బౌలర్లు అద్భుతంగా బంతులేసి వారిని కట్టడి చేశారు. 20 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, హర్‌ప్రీత్ బ్రార్‌లు అద్భుత బంతులేశారు.
పంజాబ్ ఛేదనలో 17వ ఓవర్ వరకూ బాగానే ఆడింది. 18, 19 ఓవర్లలో కాస్త వెనుకబడ్డాం. మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకూ వెళ్లడంతో రెండు వికెట్లు కోల్పోయి ఓటమిపాలయ్యాము' అని జంబో చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
DCvsSRH: ఐపీఎల్ 2021లో కరోనా కలకలం.. ఎస్ఆర్‌ఎచ్ స్టార్ ఆటగాడికి పాజిటివ్! షెడ్యూల్ ప్రకారమే ఢిల్లీతో మ్యాచ్!