
నటరాజన్‌కు కరోనా
దుబాయ్ వేదికగా ఈ రోజు రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు సన్‌రైజర్స్ బౌలర్ టీ నటరాజన్ కరోనా బారిన పడ్డాడు. నటరాజన్‌కు కరోనా సోకినట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ప్రస్తుతం నటరాజన్‌కు ఎలాంటి లక్షణాలూ లేవట.
జ్వరం, దగ్గు, జలుబు లాంటి సాధారణ లక్షణాలు కూడా లేవని తెలుస్తోంది. ప్రస్తుతం నట్టూ దుబాయ్ హోటల్లో మిగతా టీమ్ సభ్యులకు దూరంగా ఐసోలేషన్‌లో ఉంటున్నాడు. నటరాజన్ ఇటీవలే గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌నెస్ సాదించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2021 కోసం యూఏఈ వచ్చాడు. ఒక్క మ్యాచ్ కూడా ఆడకముందే అతడికి కరోనా సోకింది.

నటరాజన్, శంకర్ దూరం
టీ నటరాజన్‌కు సన్నిహితంగా ఉన్న మరో ఎస్ఆర్‌ఎచ్ ప్లేయర్ విజయ్ శంకర్. ముందస్తు జాగ్రత్తలో భాగంగా విజయ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయాడు. ఈ ఇద్దరితో పాటు ఎస్ఆర్‌ఎచ్ టీమ్ మేనేజర్ విజయ్‌కుమార్, ఫిజియో శ్యామ్ సుందర్, డాక్టర్ అంజనా వన్నన్, లాజిస్టిక్స్ మేనేజర్ తుషార్ ఖేడ్కర్, నెట్ బౌలర్ పెరియసామి కూడా ఐసోలేషన్‌లో ఉన్నారు.
వీళ్లందరికీ ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించినట్లు ఐపీఎల్ తన ప్రకటనలో పేర్కొంది. మరోసారి కరోనా టెస్టులు చేయనున్నారట. టీ నటరాజన్, విజయ్ శంకర్ ఈ రోజు జరిగే మ్యాచుకు దూరం కానున్నారు.

షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్
ఎస్ఆర్‌ఎచ్ మిగతా ప్లేయర్స్, ఇతర సిబ్బందికి ఈ రోజు ఉదయం ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. వాటిలో అందరికీ నెగిటివ్ వచ్చిందట. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఐపీఎల్ స్పష్టం చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల ప్లేయర్స్ కరోనా బారిన పడడంతో ఐపీఎల్ 2021 సీజన్‌ను తొలి 30 మ్యాచ్‌ల తర్వాత నిలిపేసిన విషయం తెలిసిందే. ఇప్పడు రెండో దశలోనూ కరోనా కేసుల బయటపడటం కాస్త ఆందోళన కలిగిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగానే ఈ నెల 10న భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన ఐదవ టెస్ట్ మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే.

ఫస్టాఫ్‌లో విఫలమైన సన్‌రైజర్స్
ఇప్పటిదాకా 8 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరో రెండు మ్యాచ్‌లు గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ సునాయసంగా ప్లే ఆఫ్స్ చేరుతుంది. గతేడాది ఇదే యూఏఈ గడ్డపై ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచి తృటిలో టైటిల్ చేజార్చుకున్న ఢిల్లీ.. ఈ సారి టైటిల్ పట్టాలని చూస్తోంది.
మరోవైపు ఫస్టాఫ్‌లో దారుణంగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఏడు మ్యాచులలో ఒక్క విజయం) యూఏఈలోనైనా మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటుంది. బల బలాలు పరిశీలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది.


Click it and Unblock the Notifications












