Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సంజీవ్ గోయెంకా‌పై నిషేధం విధించాలి: ఐపీఎల్ మాజీ ఛైర్మన్

లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకాపై నిషేధం విధించాలని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ బీసీసీఐకి సూచించారు. సంజీవ్ గోయెంకా ఒక మూర్ఖుడని, అతన్ని క్రికెట్‌కు దూరంగా ఉంచాలని అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ శుభారంభం అందుకోలేకపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్ అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌ను సంజీవ్ గోయెంకా మందలించినట్లు ఓ వీడియో వైరల్‌గా మారింది. ఓటమిని తట్టుకోలేక పంత్‌తో పాటు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్‌ను సంజీవ్ గోయెంకా అర్సుకున్నాడని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, పనిగట్టుకొని కొందరు వీడియోలను ఎడిట్ చేశారని లక్నో సూపర్ జెయింట్స్ వివరణ ఇచ్చింది.

పూర్తి వీడియోను షేర్ చేసిన లక్నో..

మ్యాచ్ అనంతరం రిషభ్ పంత్‌తో సంజీవ్ గోయెంకా జరిపిన సంభాషణకు సంబంధించిన పూర్తి వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ వీడియోలోని కొంత భాగాన్ని కట్ చేసి అసత్య ప్రచారం చేశారని స్పష్టం చేసింది. కానీ అప్పటికే సంజీవ్ గోయెంకాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. గతంలో అతను మహేంద్ర సింగ్ ధోనీ, కేఎల్ రాహుల్ పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో.. తాజాగా రిషభ్ పంత్‌ను కూడా మందలించాడని నెటిజన్లు భావించారు. కెప్టెన్లకు గౌరవం ఇవ్వని సంజీవ్ గోయెంకాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Lalit Modi Slams LSG Owner Sanjiv Goenka Calls Him a Pompous Clown and Demands Life Ban

సంజీవ్ గోయెంకాపై నిషేధం విధించాలి..

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ సైతం సంజీవ్ గోయెంకా తీరును తప్పుబట్టాడు. ఒక్క మ్యాచ్‌కే కెప్టెన్‌ను మందలించడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఈ వ్యవహారంపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఘాటుగా స్పందించాడు. సంజీవ్ గోయెంకా నిషేధం విధించాలని బీసీసీఐకి సూచించాడు.

'నేను ముందే చెప్పాను. లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా ఒక మూర్ఖుడు. అగ్రశ్రేణి జోకర్ అని. అతని ప్రవర్తన చూస్తుంటే నాకు సిగ్గుగా అనిపిస్తోంది. నేను ఐపీఎల్‌ను అభిమానులు, ఆటగాళ్ల కోసం సృష్టించాను. ప్రతి ఏడాది ఇలాంటి సంఘటనలు జరగడానికి కాదు.

సంజీవ్ గోయెంకా అహంకారి..

నేను గనుక ఇప్పటికీ ఐపీఎల్ ఛైర్మన్‌గా ఉండి ఉంటే.. సంజీవ్ గోయెంకాపై తక్షణమే నిషేధం విధించి, అతని జట్టు యాజమాన్య హక్కులను శాశ్వతంగా రద్దు చేసేవాడిని. సంజీవ్ గోయెంకా ఒక అహంకారి. ఫ్రాంచైజీ ఒప్పందంలో సరిగ్గా ఇలాంటి సమస్యల కోసమే ఒక ప్రత్యేక నిబంధన ఉంది. బీసీసీఐ దానిని అమలు చేయాలి. అన్నింటికంటే నిజాయితీకే ప్రాధాన్యత ఇవ్వండి. అతని పలుకుబడి, డబ్బును చూసి వదిలేయకూడదు. అభిమానులు, ఆటగాళ్లు ఈ ఘటనను గుర్తుంచుకుంటారు.

సంజీవ్ గోయెంకా సరిదిద్దలేని విధంగా నిబంధనలను ఉల్లంఘించారు. దీనికి ఉన్న ఏకైక పరిష్కారం.. అతన్ని క్రికెట్ ప్రపంచం నుంచి నిషేధించి, ఫ్రాంచైజీలను వెనక్కి తీసుకోవడమే.'అని లలిత్ మోదీ ఎక్స్‌వేదికగా వరుస ట్వీట్లు చేశారు.

Story first published: Thursday, April 2, 2026, 22:11 [IST]
Other articles published on Apr 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+