Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

17 ఏళ్ల తర్వాత చెంప దెబ్బ వీడియో విడుదల!

ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన ఘటనగా హర్భజన్ సింగ్ X శ్రీశాంత్ చెంప దెబ్బ ఎపిసోడ్ నిలిచిపోయింది. అరంగేట్ర ఐపీఎల్ 2008 సీజన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన హర్భజన్ సింగ్ కెరీర్‌లో ఓ మాయని మచ్చగా నిలిచిపోయింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన అన్‌సీన్ వీడియోను ఐపీఎల్ మాజీ ఛైర్మెన్ లలిత్ మోదీ ఓ ఇంటర్వ్యూలో విడుదల చేశాడు. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సమయంలో ఈ దురదృష్టకర ఘటన చోటు చేసుకోగా.. అందుకు సంబంధించిన స్పష్టమైన ఫుటేజీని లలిత్ మోదీ షేర్ చేశారు.

చెంప చెళ్లుమనిపించిన భజ్జీ..

ఆ సీజన్‌లో హర్భజన్ సింగ్ ముంబై ఇండియన్స్‌కు ఆడగా.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్(పంజాబ్ కింగ్స్)కు శ్రీశాంత్ ప్రాతినిథ్యం వహించాడు. ఆ మ్యాచ్‌లో 183 పరుగుల లక్ష్యచేధనకు దిగిన ముంబై 66 పరుగుల తేడాతో పంజాబ్ చేతిలో చిత్తయ్యింది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే క్రమంలో హర్భజన్ సింగ్.. శ్రీశాంత్‌ చెంప చెళ్లమనిపించాడు. దాంతో ఆ సీజన్‌ మొత్తం ఆడకుండా భజ్జీపై నిషేధం విధించారు. శ్రీశాంత్ ఏడుస్తున్న వీడియోనే అందరికి తెలుసు. కానీ కొట్టిన వీడియోను అప్పటి బ్రాడ్‌కాస్టర్, ఐపీఎల్ అధికారులు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇన్నాళ్లకు చెంప దెబ్బ కొట్టిన ఫుటేజీని లలిత్ మోదీ పంచుకున్నారు.

Lalit Modi Shares Unseen Slapgate Video Harbhajan Singh Slaps Sreesanth During IPL 2008

తిరగబడిన శ్రీశాంత్..

ఈ వీడియోలో పంజాబ్ ఆటగాళ్లందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వచ్చిన హర్భజన్ సింగ్.. శ్రీశాంత్ దగ్గరకు రాగానే కోపంతో చెంప చెళ్లమనిపించాడు. ఈ అనూహ్య ఘటనతో శ్రీశాంత్ నివ్వెరపోయాడు. అలానే మౌనంగా నిలబడిపోయాడు. అతని దగ్గరకు మళ్లీ వచ్చిన హర్భజన్ సింగ్ బూతులు తిట్టాడు. అప్పుడు కోపంతో ఊగిపోయిన శ్రీశాంత్.. తిరగబడే ప్రయత్నం చేయగా సహచర ఆటగాళ్లు అడ్డుకున్నారు. హర్భజన్ సింగ్‌ను ఇర్ఫాన్ పఠాన్ దూరంగా తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

హర్భజన్ సింగ్ పశ్చాత్తాపం..

ఈ ఘటనపై అనేక ఇంటర్వ్యూల్లో హర్భజన్ సింగ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. దేవుడు అవకాశం కలిపిస్తే ఆ ఘటనను తన జీవితంలో నుంచి చెరిపేస్తానని తెలిపాడు. 'నా జీవితంలో ఏదైనా మార్చుకొనే అవకాశాన్ని దేవుడిస్తే.. శ్రీశాంత్ జరిగిన ఘటనను సరిదిద్దుకుంటా. నా కెరీర్‌కు మచ్చగా మారిన ఈ ఘటనను పూర్తిగా తొలగిస్తా. నేను చేసింది తప్పే. అలా చేయి చేసుకోవాల్సింది కాదు. ఇప్పటికే 200 సార్లు క్షమాపణలు చెప్పి ఉంటా. ఇన్నేళ్లు గడిచినా.. ఆ ఘటన విషయంలో ఇప్పటికీ పశ్చాత్తాపపడుతూనే ఉంటా. తప్పులు చేయడం సహజమే. కానీ వాటిని పునరావృతం చేయకూడదు. అతను నా సహచరుడు. మేమిద్దం కలిసి మ్యాచ్‌లు ఆడాం. కానీ ఆ మ్యాచ్‌లో ప్రత్యర్థులుగా తలపడ్డాం. శ్రీశాంత్ రెచ్చగొట్టాడు. కానీ నేను కాస్త విజ్ఞతతలో ప్రవర్తించాల్సింది. చేయి చేసుకోవాల్సింది కాదు.'అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భజ్జీ భావోద్వేగానికి గురయ్యాడు.

Story first published: Friday, August 29, 2025, 12:48 [IST]
Other articles published on Aug 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+