Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అప్పులున్నాయి కాపాడండి.. లలిత్ మోదీ కాళ్లు పట్టుకున్న స్టార్ క్రికెటర్! ఎవరంటే?

వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ తన సాయం కోరాడని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తెలిపారు. ఐపీఎల్ 2011 వేలంలో క్రిస్ గేల్ అన్ సోల్డ్ కావడంతో.. అవకాశం ఇప్పించాలని తనను బతిమాలాడని లలిత్ మోదీ గుర్తు చేసుకున్నారు. తనకు చాలా అప్పులు ఉన్నాయని, వాటిని తీర్చాలంటే ఐపీఎల్ ఆడటమే తన ముందున్న ఏకైక మార్గమని గేల్ రిక్వెస్ట్ చేశాడని లలిత్ మోదీ చెప్పుకొచ్చారు.

అన్‌సోల్డ్ కావడంతో..

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్‌‌కు చెందిన 'ది ఓవర్‌లాప్ క్రికెట్'షోలో లలిత్ మోదీ ఈ విషయాలను పంచుకున్నారు. 'అది 2011 నాటి మాట. నాకింకా గుర్తుంది. నేను అప్పుడే ఐపీఎల్ నుంచి బయటకు వచ్చి లండన్‌లో సెటిల్ అవుతున్నాను. నాకు మంచి ఫ్రెండ్ అయిన క్రిస్ గేల్‌ను ఐపీఎల్ 2011 వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయలేదు. అప్పుడు అతని నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది.

Lalit Modi Recalls Chris Gayle s Financial Crisis and How Vijay Mallya Saved His IPL Career
Photo Credit: X (twitter)

'వేలంలో నన్ను ఎవరూ కొనుగోలు చేయలేదు'అని గేల్ నాతో అన్నాడు. అయితే గేల్ అప్పటి వరకు సరిగ్గా రాణించలేదు. ఐపీఎల్ అంటేనే అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం. అంతకుముందు అతను కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు. ఆ జట్టు తరఫున అతను సరిగ్గా ఆడలేదు. ఈ లీగ్‌లో అతను కొంచెం బద్ధకించాడు. అప్పుడు గేల్ నాతో.. 'నాకు చాలా అప్పులు ఉన్నాయి, నా బిల్లులు చెల్లించుకోవడానికి నాకు ఈ అవకాశం చాలా అవసరం' అని రిక్వెస్ట్ చేశాడు.

అందుకే పారిపోయా: లలిత్ మోదీ

అందుకే పారిపోయా: లలిత్ మోదీ

విజయ్ మాల్యాకు చెప్పడంతో..

ఆ తర్వాత నేను ఒకరిద్దరికి ఫోన్లు చేశాను. అందరూ క్రిస్ గేల్‌ను వద్దన్నారు. దాంతో నేను మా రోడ్డుకు అవతలివైపు ఉన్న విజయ్ మాల్యా ఇంటికి వెళ్లాను. విజయ్.. క్రిస్ గేల్‌కు ఒక అవకాశం ఇవ్వమని చెప్పాను. దానికి ఆయన.. 'నా దగ్గర ఒక స్థానం ఖాళీగా ఉంది. కానీ అతను బాగా రాణిస్తేనే నేను డబ్బులు చెల్లిస్తాను' అని అన్నాడు.’అని లలిత్ మోదీ చెప్పుకొచ్చారు.

ఆ సీజన్‌లో ఆస్ట్రేలియా-డచ్ క్రికెటర్ డిర్క్ నన్నెస్ స్థానంలో ఇంజ్యూరీ రిప్లేస్‌మెంట్‌గా ఆర్‌సీబీలోకి వచ్చిన క్రిస్ గేల్ విధ్వసంకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 12 ఇన్నింగ్స్‌ల్లో 67.55 సగటు, 183.13 స్ట్రైక్‌రేట్‌తో 608 పరుగులు చేశాడు. రెండు శతకాలు నమోదు చేసిన గేల్.. తన పాత ఫ్రాంచైజీ కేకేఆర్‌పై 55 బంతుల్లో 102 నాటౌట్ అజేయ శతకంతో చెలరేగాడు. జట్టులో ప్రధాన ఆటగాడిగా మారిపోయిన గేల్.. 2013లో అత్యధిక వ్యక్తిగ స్కోర్ 175 నాటౌట్ నమోదు చేశాడు.

ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ లీగ్‌ల్లో మొత్తం 35 టీమ్స్ తరఫున బరిలోకి దిగి 14562 పరుగులు చేశాడు. ఇందులో 22 శతకాలతో పాటు 88 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో కేకేఆర్, ఆర్‌సీబీతో పాటు పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన గేల్.. 142 మ్యాచ్‌ల్లో 148.96 స్ట్రైక్‌రేట్‌తో 4965 పరుగులు చేశాడు.

సూర్యకుమార్ యాదవ్‌పై ముంబై ఇండియన్స్ వేటు..?

సూర్యకుమార్ యాదవ్‌పై ముంబై ఇండియన్స్ వేటు..?
Story first published: Tuesday, June 9, 2026, 10:39 [IST]
Other articles published on Jun 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+