Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విజ్జీ ట్రోఫీ నుండి వైదొలిగిన జమ్మూకాశ్మీర్

Jammu & Kashmir to withdraw from Vizzy Trophy after failing to contact players

వైజాగ్: విశాఖపట్నం వేదికగా త్వరలో జరగబోయే అఖిల భారత ఇంటర్-యూనివర్శిటీ పోటీ అయిన విజ్జీ ట్రోఫీ నుండి జమ్మూకాశ్మీర్ జట్టు వైదొలిగింది. జమ్మూకాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ ఆటగాళ్లను సంప్రదించడంలో విఫలం కావడం, మ్యాచ్ వేదిక వద్ద భద్రతా ఏర్పాట్లపై స్పష్టత లేకపోవడంతో జమ్మూకాశ్మీర్ విజ్జీ ట్రోఫీ నుండి వైదొలిగింది.

రాణించిన రహానే, విహారి.. భారత్‌, వెస్టిండీస్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డ్రా

విజ్జీ ట్రోఫీ విషయమై గవర్నర్ సత్య పాల్ మల్లిక్ కార్యాలయం నుండి జమ్మూ అసోసియేషన్‌కు ఎటువంటి సమాచారం రాలేదని జమ్మూ రాష్ట్ర క్రికెట్‌ సంఘం సీఈవో సయ్యద్‌ ఆశిక్‌ హుస్సేన్‌ బుఖారీ తెలిపారు. 'మేము విజ్జీ ట్రోఫీని ఆడలేం. ఇక్కడి పరిస్థితి మెరుగుపడుతోంది. ఆటగాళ్లతో సంప్రదింపులు చేయడమే మాకు అతిపెద్ద సమస్య. మా అసోసియేషన్ కార్యాలయంలో ఆటగాళ్లందరికీ సెల్‌ఫోన్ నంబర్లు ఉన్నాయి. కానీ.. వారు ల్యాండ్‌లైన్ నంబర్లు ఇవ్వలేదు. ప్రస్తుత కాలంలో ప్రజలు ల్యాండ్‌లైన్‌ను ఉపయోగించరు, సెల్‌ఫోన్‌పై ఆధారపడుతున్నారు. కొంతమంది ఆటగాళ్లతో మాట్లాడం. మరికొంత మంది మొబైల్ ఫోన్లు పనిచేయకపోవడంతో వారితో మాట్లాడలేకపోతున్నాం. కెప్టెన్ పర్వేజ్ రసూల్ గురించి ఏ విషయం తెలియదు' అని బుఖారీ పేర్కొన్నారు.

ఆర్టికల్ 370ను రద్దు చేసినప్పటి నుండి లోయ మూసివేయబడింది. మొబైల్, ఇంటర్నెట్ కనెక్షన్ చాలా తక్కువగా ఉంది. అసోసియేషన్ కూడా ఆటగాళ్లను నేరుగా చేరుకోలేదని బుఖారీ చెప్పారు. 'ఆటగాళ్లను వెతకడానికి కారును పంపితే.. వారి గ్రామాల్లో ఏమి జరుగుతుందో మాకు తెలియదు. ఆ రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. విజ్జీ ట్రోఫీ కేవలం స్థానిక టోర్నమెంట్. బీసీసీఐ టోర్నమెంట్ కాదు. ఈ సీజన్‌లో ఆడకపోవడమే మంచిదని మేము భావించాం' అని బుఖారీ తెలిపారు. ఆగస్టు 17 వరకు జమ్మూ జట్టు కోసం ఆంధ్ర వేచిచూసింది. కానీ.. జమ్మూ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో టోర్నీని కొనసాగించాలని నిర్ణయించుకుంది.

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. భారత్‌కు ఇద్దరు కెప్టెన్‌లు

Story first published: Tuesday, August 20, 2019, 11:26 [IST]
Other articles published on Aug 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+