Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సందీప్‌ను ఆ నోబాల్ జీవితాంతం వెంటాడుతోంది: బాలాజీ

న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ పేసర్ సందీప్ శర్మ‌కు మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీ అండగా నిలిచాడు. దురదృష్టవశాత్తు నోబాల్ వేసాడని భరోసా ఇచ్చాడు. కానీ తమ జట్టు ఓటమికి కారణమైన ఈ బంతి తన జీవితాంతం మరిచిపోలేడని తెలిపాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో సందీప్ శర్మ నోబాల్ వేసి ఘోర తప్పిదం చేశాడు.

ఫ్రీ హిట్‌గా వచ్చిన బంతిని హైదరాబాద్ బ్యాటర్ అబ్దుల్ సమద్ సిక్స్‌గా మలిచి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అద్భుత విజయాన్నందించాడు. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సందీప్ శర్మ తప్పిదం కారణంగా రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే సందీప్ శర్మపై బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Lakshmipathy Balaji says Sandeep Sharma will be regretting the no-ball forever

'గతంలో సీఎస్‌కే‌తో మ్యాచ్‌‌లో చివరి మూడు బంతులను సందీప్ శర్మ అద్భుతంగా వేసాడు. ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అలాంటి అవకాశమే వచ్చి చేజారింది. దురదృష్టవశాత్తూ నో బాల్ పడటంతో మ్యాచ్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఒక్కసారిగా షాక్‌కు గురైన సందీప్ చివరి బంతిని తనదైన శైలిలో సంధించలేకపోయాడు.

మ్యాచ్ ముగిసిందని సంబరపడేలోగా నోబాల్ సైరన్ మోగడంతో రాజస్థాన్ టీమ్, అభిమానులు సైలెంట్ అయిపోయారు. వారిని తీవ్రంగా బాధపెట్టింది. ఈ ఒక్క బంతిని మాత్రం సందీప్ తన జీవితం మొత్తం గుర్తు పెట్టుకుంటాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ వెనుకబడీ మరీ పుంజుకోవడానికి కారణం గ్లెన్ ఫిలిప్స్. ఎలాంటి బౌలర్‌నైనా దూకుడుగా ఆడేయడంలో గ్లేన్ నిపుణుడు.

చివరి మూడు ఓవర్లలో ఎలాంటి బ్యాటింగ్ చేయాలో గ్లేన్‌కు బాగా తెలుసు. తదుపరి మ్యాచ్‌ల్లో ఫిలిప్ గ్లేన్ వల్ల సన్‌రైజర్స్ బ్యాటింగ్ మరింత బలోపేతమవుతుంది.'అని బాలాజీ చెప్పుకొచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరాలంటే చివరి నాలుగు మ్యాచ్‌లను కచ్చితంగా గెలవాలి.

Story first published: Monday, May 8, 2023, 21:19 [IST]
Other articles published on May 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+