IPL 2022: గుజరాత్ టైటాన్స్‌కు గుడ్ న్యూస్.. గండం గట్టెక్కిన హార్దిక్ పాండ్యా!

బెంగళూరు: ఐపీఎల్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్‌కు గుడ్ న్యూస్. ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఆ జట్టు కెప్టెన్, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పెద్ద గండం నుంచి గట్టెక్కాడు. ఐపీఎల్ 2022 సీజన్ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పెట్టిన ఫిట్‌నెస్, యోయో టెస్ట్‌లను హార్దిక్ పాసయ్యాడు. దాంతో ఐపీఎల్ ఆడేందుకు అతనికి మార్గం సుగుమమైంది. అయితే ఈ ఫిట్‌నెస్ టెస్ట్‌పై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

135 కిలో మీటర్ల వేగంతో..
గత కొంతకాలంగా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యాకు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బీసీసీఐ ఫిట్‌నెస్ టెస్ట్‌లతో పాటు యోయో టెస్ట్ నిర్వహించింది. ఈ పరీక్షలో హార్దిక్ పాండ్యా గంటకు 135 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసినట్లు, యోయో టెస్ట్‌లో 17 స్కోర్ నమోదు చేసినట్లు ప్రముఖ వార్త సంస్థ పీటీఐ తెలిపింది. యోయో టెస్ట్ కటాఫ్ 16.5 కాగా.. పాండ్యా బార్డర్‌లో గట్టెక్కాడన్నమాట. గతంలో యోయో టెస్ట్ టాప్ స్కోరర్‌గా పాండ్యా నిలిచాడు. విరాట్ కోహ్లీతో కలిసి అతను 20 ప్లస్ స్కోర్ నమోదు చేసేవాడు.

టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో..
వయసు పెరగడం.. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమవడం.. గాయాల నేపథ్యంలో అతని ఫిట్‌నెస్ లెవల్స్ పడిపోయాయి. ఇక తాజా టెస్ట్‌లో హార్దిక్ నెగ్గడంతో అతను గుజరాత్ జట్టుతో త్వరలో చేరనున్నాడు. మరో క్రికెటర్ పృథ్వీ షా యోయో టెస్ట్‌ల్లో విఫలమైనట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఆటగాళ్ల గాయాలను, ఫిట్‌నెస్ విషయాలను నిశితంగా పరిశీలిస్తున్న బీసీసీఐ.. ఐపీఎల్ ముంగిట ఆటగాళ్ల ఫిట్‌నెస్ లెవల్స్‌ను టెస్ట్ చేస్తోంది.

ప్రపంచకప్ వైఫల్యంతో..
కాగా గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్ తర్వాత గాయాలతో హార్దిక్ పాండ్యా టీమిండియాకు దూరమయ్యాడు. వెస్టిండీస్, శ్రీలంకతో సిరీస్‌లో బరిలోకి దిగాలని భావించినప్పటికీ పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. రంజీల్లో ఆడి ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని సూచించినప్పటికీ హార్దిక్ పాండ్యా మాత్రం రంజీ ట్రోఫీలో ఆడలేదు. ఈ క్రమంలోనే అతన్ని టెస్ట్ చేసింది. ఒకవేళ అతను విఫలమైతే ఐపీఎల్‌కు దూరమయ్యేవాడు. గతంలో గాయం కారణంగా జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్ ఎన్సీఏలో నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టుల్లో పాస్ అయ్యాకే ఐపీఎల్‌లో ఆడడానికి బీసీసీఐ అనుమతించింది.

గుజరాత్ టైటాన్స్ టీమ్..
హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ, లాకీ ఫెర్గూసన్, అభినవ్ సదరంగాని, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, డొమినిక్ డ్రేక్స్, దర్శన్ నల్కండే, యశ్‌రీ జోసెఫ్ దయాల్, ప్రదీప్ జోసెఫ్ దయాల్, , డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, వరుణ్ ఆరోన్, బి సాయి సుదర్శన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications