అందుకే ఐపీఎల్ 2022 సీజన్‌కు దూరంగా ఉన్నా: కైల్ జెమీసన్

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో భారీ ధర పలికిన న్యూజిలాండ్ స్టార్ పేసర్ కైల్ జెమీసన్ ఆశ్చర్యకరంగా ఐపీఎల్ 2022 సీజన్‌కు దూరంగా ఉన్నాడు. ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా జరిగే మెగావేలానికి ఈ న్యూజిలాండ్ పేసర్ రిజిస్టర్ చేసుకోలేదు. కివీస్ నుంచి మొత్తం 24 మంది వేలం రేసులో నిలవగా.. స్టార్ ఆటగాడైన జెమీసన్ దూరంగా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గతేడాది జరిగిన వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) రూ. 15 కోట్ల భారీ ధరకు జెమీసన్‌ను తీసుకున్న విషయం తెలిసిందే.

రూ.15 కోట్లు దండుగ..
అయితే జెమీసన్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఆర్‌సీబీ అతన్ని రిటైన్ చేసుకోలేదు. గత సీజన్‌లో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన జేమీసన్ 28 ఓవర్లు వేసి భారీగా పరుగులు సమర్పించుకుని కేవలం 9 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కాగా, ఇటీవలి కాలంలో జేమీసన్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ ఐపీఎల్ వేలంలో పాల్గొనకపోవడం అందర్నీ షాక్‌కు గురిచేసింది. 12 టెస్ట్‌ల్లోనే 62 వికెట్లు తీసిన జెమీసన్ సులువుగా రూ.10 కోట్లు పలికేవాడు. అయినా అతను కావాలనే దూరంగా ఉన్నాడు.

బయో బబుల్‌తో విసిగి..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐపీఎల్‌కు దూరంగా ఉండటానికి గల కారణాన్ని జెమీసన్ వెల్లడించాడు. సుదీర్ఘ కాలం పాటు బయో బబుల్‌లో ఉండటం ఇష్టంలేక, కుటుంబంతో గడపాలనే ఉద్దేశంతో ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని భావించినట్లు ఈ కివీస్ పేసర్ చెప్పుకొచ్చాడు. ‘ఐపీఎల్‌కు దూరంగా ఉండటానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. అందులో మొదటిది ఏంటంటే గత ఏడాది కాలంగా బయోబబుల్ వాతావరణంతో విసిగిపోయాను. ఐసోలేషన్, క్వారంటైన్‌లో ఉంటూ మానసిక వ్యధను అనుభవించాను. మరో ఏడాది ఇలానే క్రికెట్ ఆడాలంటే నేను కనీసం ఓ 6-8 వారాలు ఇంట్లో వాళ్లతోనే గడపాలి. అప్పుడే నేను కొంచెం రిలాక్స్ అవుతాను.

ఆటపై ఫోకస్ పెట్టేందుకు..
ఇక రెండోది ఏంటంటే.. నా అంతర్జాతీయ కెరీర్ ఇంకా ఆరంభ దశలోనే ఉంది. నా కెరీర్ మొదలై రెండేళ్లే అవుతుంది. నా ఆటపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. న్యూజిలాండ్ తరఫున మూడు ఫార్మాట్లు ఆడుతున్న నేపథ్యంలో ఆటగాడిగా నేను మరింత మెరుగ్వాలి. అందుకే ఆటపై ఫోకస్ పెట్టి, మరింత సమయం వెచ్చించాలనుకుంటున్నా. ఆ క్రమంలోనే కొంతకాలం ఇంట్లోనే హాయిగా ఉండాలనుకుంటున్నా'అని జెమీసన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications