
కెప్టెన్‌గా రాహుల్ రికార్డ్:
కేఎల్ రాహుల్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన భారత క్రికెటర్‌గా, కెప్టెన్‌గా కూడా రికార్డ్ క్రియేట్ చేశాడు. రాహుల్ సహా మయాంక్ అగర్వాల్ (26; 20 బంతుల్లో 4x4), నికోలస్ పూరన్ (17; 18 బంతుల్లో 1x4), కరన్ నాయర్ (15; 8 బంతుల్లో 2x4) పరుగులు చేయడంతో పంజాబ్ జట్టు 3 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ ఇన్నింగ్స్ అంతా రాహుల్ వన్‌మ్యాన్ షోగా నిలిచింది. ఇక ఈ సీజన్‌లో కేఎల్ రాహుల్ తొలి సెంచరీ నమోదు చేశాడు. అయితే బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ సరైన ఫీల్డింగ్ చేసుంటే.. రాహుల్ సెంచరీ చేసేవాడు కాదు. కోహ్లీ రెండు క్యాచ్‌లు వదిలేయడంతో రాహుల్ సెంచరీ బాదాడు.

83 పరుగుల వద్ద మొదటి లైఫ్:
బెంగళూరు స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ 17వ ఓవర్ వేస్తున్నాడు. ఆ ఓవర్ ఐదో బంతికి సిక్స్ కొట్టి ఊపు మీదున్న కేఎల్ రాహుల్.. ఆ తర్వాత లో ఫుల్ టాస్‌ను కూడా సిక్స్ మలిచే ప్రయత్నం చేశాడు. కానీ బౌండరీ లైన్ దగ్గర ఉన్న విరాట్ కోహ్లీకి క్యాచ్‌గా వెళ్లింది. సునాయాస క్యాచ్ కాకున్నా.. కోహ్లీ లాంటి టాప్ ప్లేయర్ ఆ క్యాచ్‌ను పట్టుకుంటాడు. కానీ కోహ్లీ ఆ క్యాచ్‌ను నేలపాలు చేశాడు. ఆ సమయంలో రాహుల్ 83 పరుగుల వద్ద ఉన్నాడు. రాహుల్‌కు మొదటి లైఫ్ వచ్చింది.

89 పరుగుల వద్ద రెండో లైఫ్:
మరో పేసర్ నవదీప్ సైనీ వేసిన 18వ ఓవర్ చివరి బంతికి కూడా కేఎల్ రాహుల్‌కు మరో లైఫ్ వచ్చింది. లాంగ్ ఆఫ్ దిశగా భారీ షాట్‌కు యత్నించిన రాహుల్.. బంతిని గాల్లోకి లేపాడు. కొద్ది దూరం పరిగెత్తుకుంటూ వెళ్లిన విరాట్ కోహ్లీ.. తేలికైన క్యాచ్‌ను వదిలేశాడు. తొలి క్యాచ్‌ను వదిలేసినప్పుడు సీరియస్‌గా ఉన్న కోహ్లీ.. రెండోసారి సైలెంట్ అయిపోయాడు. ఏంటి ఇది అనేలా చేతులతో సైగ చేశాడు. ఆ సమయంలో రాహుల్ 60 బంతుల్లో 89 రన్స్ చేశాడు. రెండు జీవనాధారాలు లభించడంతో రాహుల్ సిక్సులతో రెచ్చిపోయి సెంచరీ బాదాడు.

19వ ఓవర్లో విధ్వంసమే:
ఇక డేల్ స్టెయిన్ వేసిన 19వ ఓవర్లో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ విధ్వంసమే సృష్టించాడు. ఆ ఓవర్లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది ఏకంగా 26 రన్స్ పిండుకున్నాడు. ఇక శివమ్ దూబే వేసిన 20వ ఓవర్లో కరుణ్ నాయర్ (15) ఒక ఫోర్ బాదగా.. రాహుల్ వరుసగా ఒక ఫోర్, రెండు సిక్సర్లు బాది 23 రన్స్ రాబట్టారు. రెండు క్యాచ్‌లను వదిలేసిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి.. తాను ఎంత పెద్ద తప్పు చేశానో అని అప్పుడు తెలిసొచ్చింది.

నాలుగు పరుగులకే మూడు వికెట్లు:
లక్ష్య ఛేదనలో బెంగళూరు ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 207 పరుగుల టార్గెట్‌లో ఒత్తిడికి లోనైన ఆర్సీబీ నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ మూడు ఓవర్లు ఆడకుండానే మూడు వికెట్లను కోల్పోయింది. దేవదూత్ పడిక్కల్, జోష్ ఫిలిప్పి, విరాట్ కోహ్లీ విఫలమయ్యారు. మధ్యలో ఆరోన్ ఫించ్ (20), ఏబీ డివిలియర్స్ ( 28; 18 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు మెరుపులు మెరిపించినా ఎంతసేపో క్రీజ్‌లో నిలవలేదు. 14 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది.


Click it and Unblock the Notifications












