
దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 100 క్యాచ్‌లు అందుకున్న రెండో వికెట్ కీపర్‌గా నిలిచాడు. కింగ్స్ పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఈ మైలురాయిని అందుకున్నాడు. కింగ్స్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇచ్చిన క్యాచ్‌ను సూపర్ డైవ్‌తో అందుకున్నధోనీ.. ఐపీఎల్ 100 క్యాచ్‌ల క్లబ్‌లో చేరాడు. ధోనీ కన్నా ముండు కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఈ ఘనతను అందుకున్నాడు.
ఈ జాబితాలో 186 మ్యాచ్‌ల్లో 103 క్యాచ్‌లతో దినేశ్ కార్తీక్ అగ్రస్థానంలో ఉండగా.. 195 మ్యాచ్‌ల్లో 100 క్యాచ్‌లతో ధోనీ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఈ ఇద్దరి తర్వాత పార్థివ్ పటేల్(66), నమాన్ ఓజా(65), రాబిన్ ఊతప్ప(58) ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఈ లిస్ట్‌లో కార్తీక్, ధోనీ మినహా మిగతా ఎవ్వరికి తరుచూ కీపింగ్ చేసే అవకాశం రాలేదు.
ఐపీఎల్‌లో అత్యధిక ఔట్లలో భాగమైన వికెట్ కీపర్లలో మాత్రం ధోనీ అగ్ర స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు మహీ క్యాచ్‌లు, స్టంపౌట్‌లతో కలిపి 139 ఔట్లలో పాలుపంచుకున్నాడు. ఈ జాబితాలో దినేశ్ కార్తీక్ 133 ఔట్లలో భాగమై రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 10 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నందుకుంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో పరాజయం చవిచూసిన సీఎస్‌కే.. పంజాబ్‌ను చిత్తు చేసి టచ్‌లోకి వచ్చింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(52 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 63), నికోలస్ పూరన్(17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 33) రాణించారు.
అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 181 పరుగులు చేసి 16 బంతులు ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. షేన్ వాట్సన్(53 బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్స్‌లతో 83 నాటౌట్), ఫాఫ్ డూప్లెసిస్(53 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 87 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో చెలరేగి రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది సెకండ్ చేజింగ్ హయ్యెస్ట్ పార్టనర్‌షిప్ కాగా ఈ సీజన్‌లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం.