Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Kusal Mendis: అందుకే చిత్తుగా ఓడిపోయాం

Kusal Mendis, NZ vs SL: పేలవ బ్యాటింగ్ కారణంగానే న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసామని శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండీస్ తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. దాంతో ఈ మెగా టోర్నీలో శ్రీలంక 2 విజయాలతోనే సరిపెట్టుకుంది. 7 పరాజయాలతో పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచింది.

మ్యాచ్ అనంతరం ఈ ఘోరపరాజయంపై స్పందించిన కుశాల్ మెండీస్(Kusal Mendis) తమ ఓటమికి గల కారణాన్ని వెల్లడించాడు. 'తొలి పవర్ ప్లేలోనే మూడు-నాలుగు వికెట్లు కోల్పోవడం దెబ్బతీసింది. దాంతో బ్యాటింగ్‌లో మేం ఇబ్బంది పడ్డాం. మిడిల్ ఓవర్లలో ఓ మంచి భాగస్వామ్యం లభించి ఉంటే ఈ వికెట్‌పై 300 ప్లస్ రన్స్ చేసేవాళ్లం. దిల్షాన్ మధుషంక అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

Kusal Mendis We lost 4 wickets in first 10 overs cost us After New Zealand Beat Sri Lanka

కానీ లక్ష్యం చిన్నది కావడంతో ఏం చేయలేకపోయాం. ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా కష్టం. ఈ టోర్నీలో రెండు మ్యాచ్‌ల అనంతరం నాకు కెప్టెన్సీ దక్కింది. టీమ్ సారథ్యాన్ని నేను బాగా ఆస్వాదించాను. కానీ వ్యక్తిగత ప్రదర్శన పట్ల చాలా నిరాశగా ఉన్నాను. యువ ఆటగాళ్లు సత్తా చాటడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్లు మా భవిష్యత్తు'అని కుశాల్ మెండీస్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులకు కుప్పకూలింది. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ పెరీరా(28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. చివర్లో మహీశ్ తీక్షణ(38 నాటౌట్), దిల్షన్ మధుషంక(19 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్(3/37), లాకీ ఫెర్గూసన్(2/35), మిచెల్ సాంట్నర్(2/22), రచిన్ రవీంద్ర(2/21) నిప్పులు చెరిగారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 23.2 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు డెవాన్ కాన్వే(42 బంతుల్లో 9 ఫోర్లతో 45), రచిన్ రవీంద్ర(34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), డారిల్ మిచెల్(31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) రాణించారు. గ్లేన్ ఫిలిప్స్(10 బంతుల్లో 3 ఫోర్లతో 17 నాటౌట్) ధాటిగా ఆడాడు. శ్రీలంక బౌలర్లలో ఏంజెలో మాథ్యూస్(2/29) రెండు వికెట్లు తీయగా.. మహీష తీక్షణ, చమీరా తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Thursday, November 9, 2023, 22:16 [IST]
Other articles published on Nov 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+