Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Kusal Mendis: అందుకే గెలిచాం

Kusal Mendis: సమష్టి ప్రదర్శనతోనే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించామని శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండీస్ తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్‌లో దుమ్మురేపిన శ్రీలంక.. భారీ విజయంతో రన్‌రేట్‌తో పాటు సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది.

ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన కుశాల్ మెండీస్.. ఇదే జోరు కనబరిస్తే సెమీస్ బెర్త్ కూడా దక్కుతుందని తెలిపాడు. 'ఈ భారీ విజయంతో మా రన్‌రేట్ చాలా మెరుగైంది. ఇది మాకు కలిసొచ్చే విషయం. ఆరంభ ఓవర్లలోనే మేం అద్భుతంగా బౌలింగ్ చేశాం. అదే జోరును కొనసాగించాం. జట్టులోని ప్రతీ ఒక్కరు అద్భుత ప్రదర్శన కనబర్చారు.

Kusal Mendis says Everyone did really well today after Sri Lanka beat England in World Cup 2023

మాకు ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇలానే సమష్టిగా రాణిస్తే సెమీఫైనల్ బెర్త్ కూడా దక్కుతుంది. లాహిరు కుమార్‌కు జట్టులో తన బాధ్యత ఏంటో తెలుసు. అతను మా పేస్ బౌలింగ్ ఆయుధం. అతను చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఏంజేలో మాథ్యూస్ ఎంతో అనుభవం కలిగిన ఆటగాడు. మిడిల్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు. ఆటను ఆస్వాదిస్తూ ఆడగలడు. ఒత్తిడి ఎలా ఎదుర్కోవాలో అతనికి బాగా తెలుసు. మాథ్యూస్ లాంటి ఆటగాడు జట్టులో ఉండటం గొప్ప విషయం. ఈ రోజు ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉంది. ఇదే జోరును తదుపరి మ్యాచ్‌ల్లో కూడా కొనసాగిస్తాం.'అని కుశాల్ మెండీస్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 156 పరుగులకే కుప్పకూలింది. బెన్ స్టోక్స్(73 బంతుల్లో 6 ఫోర్లతో 43), జానీ బెయిర్ స్టో(31 బంతుల్లో 3 ఫోర్లతో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార(3/35), ఏంజెలో మాథ్యూస్(2/14), కాసున్ రజితా (2/36), మహీశ్ తీక్షణ(1/21) ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 25.4 ఓవర్లలో 2 వికెట్లకు 160 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సంక(83 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77 నాటౌట్), సదీరవిక్రమా(54 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 65 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.

Story first published: Thursday, October 26, 2023, 21:31 [IST]
Other articles published on Oct 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+