AFG vs SL: బ్యాటింగ్ వైఫల్యంతోనే అఫ్గానిస్థాన్ చేతిలో ఓటమిపాలయ్యామని శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండీస్ తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన శ్రీలంక 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన కుశాల్ మెండీస్.. తాము విధించిన లక్ష్యం సరిపోలేదన్నాడు.
ఈ పిచ్‌పై భారీ స్కోర్ చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. డ్యూ రావడంతో బౌలింగ్ చేయడం కష్టమైందన్నాడు. 'మా లక్ష్యం సరిపోలేదు. మేం 40 పరుగుల తక్కువగా చేశాం. ఈ వికెట్‌పై 240 పరుగులు ఏమాత్రం సరిపోవు. 280-300 పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేది. మా బౌలర్లు పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆ తర్వాత డ్యూ రావడంతో బౌలింగ్ చేయడం కష్టమైంది.

సెకండ్ ఇన్నింగ్స్‌లో బంతి బ్యాట్‌పైకి ముద్దుగా వచ్చింది. ముధుషంక అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కుర్రాడే అయినా అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. తదుపరి మ్యాచ్‌ల్లో సత్తా చాటే ప్రయత్నం చేస్తాం.'అని కుశాల్ మెండీస్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ పాతుమ్ నిస్సంక(46), కుశాల్ మెండీస్(39) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అఫ్గాన్ బౌలర్లలో ఫజలక్ ఫరూఖీ(4/34), ముజీబ్ ఉర్ రెహ్మాన్(2/38) శ్రీలంక పతనాన్ని శాసించగా.. అజ్మతుల్లా ఓమర్జాయ్, రషీద్ ఖాన్‌లకు తలో వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన అఫ్గానిస్థాన్ 45.2 ఓవర్లలో 3 వికెట్లకు 242 పరుగులు చేసి సునాయ విజయాన్ని అందుకుంది. రెహ్మత్ షా(74 బంతుల్లో 7 ఫోర్లతో 62), హష్ముతుల్లా షాహిది(74 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 58 నాటౌట్), ఒమర్జాయ్(63 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 73 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక(2/48) రెండు వికెట్లు తీయగా.. కాసున్ రజితా(1/48) ఓ వికెట్ పడగొట్టాడు.
ఈ ఓటమితో శ్రీలంక తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటే.. అఫ్గానిస్థాన్ మాత్రం సంచలన విజయంతో సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది.