2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్సింగ్ కేసు.. నేడు విచారణకు సంగక్కర

కొలంబో: 2011 వన్డే ప్రపంచకప్‌ను శ్రీలంక అమ్మేసుకుందంటూ వచ్చిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న లంక ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తూ స్పెషల్ ఇన్విస్టిగేషన్ యూనిట్(ఎస్‌ఐయూ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ దర్యాప్తు బృందం ఫైనల్‌తో సంబంధం ఉన్న ఒక్కొక్కరిని విచారిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో నేడు(గురువారం) శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరను విచారించనుంది.
నోటీసులు జారీ..
ఇప్పటికే విచారణకు హాజరు కావాల్సిందిగా 2011 వరల్డ్‌కప్‌లో శ్రీలంకకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగక్కరను కోరింది. బుధవారం ఓపెనర్ ఉపుల్ తరంగాను రెండు గంటల పాటు విచారించింది. నాటి వరల్డ్‌కప్ ఫైనల్లో తరంగ 20 బంతులు ఆడి రెండు పరుగులు చేశాడు. 'కమిటీ అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చాను. నా స్టేట్‌మెంట్‌ను వారు రికార్డు చేశారు' అని తరంగ తెలిపాడు. కానీ ప్రశ్నలేంటో చెప్పలేదు.
అప్పట్లో చీఫ్ సెలక్టర్‌గా వ్యవహరించిన శ్రీలంక మాజీ ఆటగాడు అరవింద డిసిల్వాను మంగళవారం ఆరు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. లంకలో ఫిక్సింగ్‌కు పాల్పడితే క్రిమినల్ నేరం కింద కఠినంగా శిక్షిస్తారు. లంక కరెన్సీలో రూ. 10 కోట్ల జరిమానాతో పాటు పదేళ్ల జైలు శిక్ష విధించేలా గత నవంబర్‌లో చట్టం తెచ్చారు. ఇక సంచలన ఆరోపణలు చేసిన మహిందానంద దర్యాప్తు బృందం ముందు ప్లేట్ ఫిరాయించాడు. ఫిక్సింగ్ ఆరోపణలు తన అనుమానం మాత్రమేనన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications