Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అసలు నేను జట్టులోనే లేను.. కోహ్లీ లేదా రోహిత్ వికెట్ నేనెలా తీస్తాను! కాస్త మోకాలు రుద్దు సామీ!

Jimmy Neesham gives a hilarious reply to Fan on Twitter over WTC Final

లండన్‌: న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ నీషమ్‌ ఎప్పుడూ సరదాగా ఉంటాడు. ఆన్‌ఫీల్డ్‌, ఆఫ్‌ఫీల్డ్‌ ఏదైనా కావొచ్చు అతను ఉంటే నవ్వులు పూయాల్సిందే. కెరీర్ ఆరంభం నుంచి కూడా నీషమ్‌ ఫన్నీగానే ఉంటాడు. ఇక సోషల్‌ మీడియాలో అయితే మరింత యాక్టివ్‌గా ఉంటూ.. అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తాడు. సహచర, ఇతర జట్ల ఆటగాళ్లను కూడా మనోడు వదలడు. సమయం, సందర్భాన్ని బట్టి బాంబులు పేలుస్తుంటాడు. అప్పుడప్పుడూ లైవ్ షోలు పెట్టి అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటాడు నీషమ్‌. ఈ క్రమంలోనే తాజాగా ఓ అభిమానికి అదిరే పంచ్ ఇచ్చాడు.

నీషమ్‌ లైవ్ షో

నీషమ్‌ లైవ్ షో

విషయంలోకి వెళితే.. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జూన్‌ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌ వేదికగా ప్రపంచటెస్టు చాంపిన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఫైనల్‌కు ముందు జూన్ 2 నుండి ప్రారంభమయ్యే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో కివీస్ ఇంగ్లండ్ జట్టుతో తలపడనుంది. ఇందుకోసం కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని 20 మంది సభ్యుల టెస్ట్ జట్టును కివీస్ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇప్పటికే ఇంగ్లండ్‌కు చేరుకున్న కివీస్‌ ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను కూడా ఆరంభించారు. గురువారం జేమ్స్‌ నీషమ్‌ ఓ లైవ్ షో చేశాడు. ఈ సందర్భంగా నీషమ్‌ను ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు వినూత్న రీతిలో సమాధానం ఇచ్చాడు.

జట్టులోనే లేను

టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమిండియా ఓపెనర్ రోహిత్‌ శర్మ లేదా కెప్టెన్ విరాట్‌ కోహ్లీలలో ఎవరి వికెట్‌ తీస్తాననుకుంటున్నావు అంటూ జేమ్స్‌ నీషమ్‌ను ఒక అభిమాని ప్రశ్న వేశాడు. దీనికి నీషమ్‌ ఒక నిమిషం కూడా ఆలోచించికుండా.. 'రోహిత్, కోహ్లీ వికెట్ తీసే అవకాశాలు ఏమాత్రం లేవు' అని అన్నాడు. 'అసలు నేను జట్టులోనే లేను.. ఇక వికెట్‌ ఎలా తీస్తాను?. ఒకవేళ అవకాశం వచ్చినా వికెట్‌ తీసే అవకాశాలు చాలా తక్కువ' అంటూ ఫన్నీ సమాధానమిచ్చాడు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. కాస్త మోకాలు రుద్దు సామీ అంటూ ఆ అభిమానిని నెటిజన్లు ఆడుకుంటున్నారు. నిజానికి నీషమ్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడడం లేదు.

అప్పట్లో ఆస్ట్రేలియాకే అది సాధ్యం కాలేదు.. ఇప్పుడు టీమిండియా చేసి చూపిస్తోంది: ఇంజమామ్‌

టెస్టు మ్యాచ్‌ ఆడి నాలుగు సంవత్సరాలైంది

టెస్టు మ్యాచ్‌ ఆడి నాలుగు సంవత్సరాలైంది

న్యూజిలాండ్‌ తరపున జేమ్స్‌ నీషమ్‌ టెస్టు మ్యాచ్‌ ఆడి నాలుగు సంవత్సరాలైంది. 2014లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన నీషమ్‌.. ఇప్పటివరకు 12 టెస్టులు మాత్రమే ఆడాడు. ఈ 12 టెస్టుల్లో 709 పరుగులు చేసిన నీషమ్‌.. బౌలింగ్‌లో 14 వికెట్లు తీశాడు. చివరిసారిగా 2017లో కివీస్‌ తరపున టెస్టు మ్యాచ్‌ ఆడాడు. 66 వన్డేలాడి 1320 పరుగులతో పాటు 68 వికెట్లు, 29 టీ20లు ఆడి 324 పరుగులు చేశాడు. ఆల్‌రౌండర్‌ కోటాలో నీషమ్‌ జట్టులోకి ఎంపికవుతున్నా.. తుది జట్టులో మాత్రం ఆడట్లేదు. ఐపీఎల్ టోర్నీలో కూడా ఇదే రిపీట్ అవుతోంది.

 ఐపీఎల్ 2021 ముందు కూడా

ఐపీఎల్ 2021 ముందు కూడా

ఐపీఎల్ 2021 ముందు కూడా జేమ్స్‌ నీషమ్‌ ఓ అభిమానికి ఇలానే సెటైర్ వేశాడు. 'నీషమ్‌.. ఐపీఎల్‌ త్వరలో ప్రారంభమవుతుంది. ముంబై జట్టుతో ఎప్పుడు కలుస్తావ్' అని ప్రశ్నించాడు. 'నేను ఐపీఎల్‌ 2021 ఆడేందుకు వస్తున్నా. కానీ కార్గో షిప్‌ వల్ల ఇప్పుడు సుయాజ్‌ కాలువలో చిక్కుకుపోయా. త్వరలోనే బయటపడుతా' అంటూ అభిమానికి ఫన్నీ రిప్లై ఇచ్చాడు. నీషమ్‌ ఇచ్చిన సమాధానానికి గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చాడు. 'జేమ్స్ నీషమ్‌.. 46, 44, 46 ఈ బరువులు నీ బ్యాగ్‌లో మోస్తూనే ఉన్నావా. అందుకే చిక్కుకుపోయావు' అంటూ నీషమ్‌కు మ్యాక్స్‌వెల్‌ కౌంటర్ ఇచ్చాడు.

Story first published: Friday, May 21, 2021, 13:28 [IST]
Other articles published on May 21, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+