For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీలంక ఎన్నికల సర్కస్ మొదలైంది.. మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణలపై సంగక్కర, జయవర్దనే ఫైర్

Kumar Sangakkara and Mahela Jayawardena reacts after former Sri Lanka Sports Minister alleges 2011 World Cup final was fixed

కొలంబో: 2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్స్ అయిందని సంచలన ఆరోపణలు చేసిన శ్రీలంక మాజీ క్రీడాశాఖ మంత్రి మహీందానంద అలుత్గామాగే‌పై ఆ దేశ మాజీ క్రికెటర్లు కుమార సంగక్కర, జయవర్ధనే ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీలంక ఎన్నికల సర్కస్ మొదలైందని మహేళ జయవర్ధనే సెటైరిక్‌గా ట్వీట్ చేయగా.. ఆధారాలుంటే ఐసీసీకి ఇవ్వాలని సంగక్కర సూచించాడు.

'ఈ మధ్య ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? వారి మాటలు చూస్తుంటే ఎన్నికల సర్కస్ మొదలైనట్లు అనిపిస్తుంది. ఆ ఆరోపణలకు ఆధారాలున్నాయా? శ్రీలంక రాజకీయాలు'అంటూ జయవర్దనే ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన సంగక్కర..'ఆరోపణలు చేసిన వ్యక్తి తన వద్ద ఉన్న సాక్ష్యాలను ఐసీసీ అవినీతి నీరోధక భద్రతా విభాగం దగ్గరకు తీసుకెళ్లాలి. అప్పుడు సరైన దర్యాప్తు జరిగి నిజనిజాలు బయటపడతాయి.'అని పేర్కొన్నాడు. ఇక ఈ ఆరోపణలపై ఓ టీవీ చానెల్‌తో మాట్లాడిన ఈ శ్రీలంక మాజీ కెప్టెన్.. ఈ ఆరోపణలపై విచారణ జరిపాలని డిమాండ్ చేశాడు. అప్పుడు ఈ ఊహగానాలుండయని చెప్పుకొచ్చాడు.

ఇక 2010 నుంచి 2015 వరకు శ్రీలంక కేంద్ర క్రీడాశాఖ మంత్రిగా చేసిన మహీందానంద.. తాజాగా ఆ దేశ సిరాస టీవీతో మాట్లాడుతూ 2011 ప్రపంచకప్ ఫైనల్లో ఫిక్సింగ్ జరిగిందన్నాడు. 'భారత్-శ్రీలంక మధ్య జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్స్ అయింది. ఆమ్యాచ్‌లో శ్రీలంక భారత్‌కు అమ్ముడుబోయింది. నేను క్రీడాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఇది జరిగింది. ఇన్నాళ్లు దేశం మేలు కోసం ఈ విషయం చెప్పలేదు. కానీ ఇప్పుడు నా బాధ్యతగా ఈ విషయాన్ని బయటపెడుతున్నా. నాటి ఫైనల్లో శ్రీలంక గెలిచేది. కానీ ఆ మ్యాచ్‌ను ఫిక్స్ చేసుకున్నారు. నేనేం చెబుతాన్నానో దానికి కట్టుబడి ఉంటా. ఆటగాళ్లు భాగమయ్యారని నేను అనను, కానీ కొన్ని రాజకీయ శక్తులు మాత్రం పాలుపంచుకున్నాయి'అని మహీందానంద ఆరోపించాడు.

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 274/6 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌.. స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ సెహ్వాగ్‌ (0), సచిన్‌ (18)ల వికెట్లను త్వరగా కోల్పోయింది. ఆ క్లిష్ట స్థితిలో గౌతమ్ గంభీర్(97) అద్భుత పోరాటానికి.. ధోనీ ధానాధన్ ఇన్నింగ్స్ తోడవడంతో ఆరు వికెట్లతో విజయం టీమిండియా విజయం సాధించింది. మూడేళ్ల క్రితం శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ కూడా ఈ మ్యాచ్ ఫలితంపై సందేహం వ్యక్తం చేశాడు.

Story first published: Thursday, June 18, 2020, 19:04 [IST]
Other articles published on Jun 18, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+