IPL 2022: ఆ ముంబై యువ స్పిన్నర్.. రూ.10 బిస్కెట్ ప్యాకెట్ కోసం పది కిలోమీటర్లు నడిచేవాడు!

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా 8 పరాజయాల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సమష్టిగా రాణించి గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన యువ స్పిన్నర్ కుమార్ కార్తీకేయ సింగ్‌తో ముంబైకి అదృష్టం కలిసొచ్చింది. అప్పటి వరకు వరుస పరాజయాలు చూసిన ఆ జట్టు కార్తీకేయ రాకతో గెలుపు బాట పట్టింది. జట్టులోని యువ లెఫ్టార్మ్ పేసర్ అర్షద్ ఖాన్ గాయపడటంతో అతనికి రిప్లేస్‌మెంట్‌గా మధ్యప్రదేశ్ జట్టుకు చెందిన కుమార్ కార్తికేయను తీసుకుంది.

9 డాట్ బాల్స్‌తో..
ఫస్ట్ మ్యాచ్‌లోనే ముంబై అతనికి అవకాశం ఇవ్వగా.. అతను రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. క్రీజులో సెట్ అయిన డేంజరస్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్‌ను ఔట్ చేయడంతో పాటు నాలుగు ఓవర్లు పొదుపుగా బౌలింగ్ చేసి 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 9 డాట్ బాల్స్ వేసిన అతను కేవలం ఒకే ఒక్క బౌండరీ ఇచ్చాడు. అతని సూపర్ ప్రదర్శనతో రాజస్థాన్ భారీ స్కోర్‌కు బ్రేక్ పడగా.. ముంబై ఆడుతూ పాడుతూ చేధించి తొలి విజయాన్నందుకుంది.

రూ.10 బిస్కెట్ ప్యాకెట్ కోసం..
అయితే కార్తీకేయ క్రికెట్ ప్రయాణం అందరికి స్పూర్తి దాయకం. క్రికెటర్ కావాలనే తన లక్ష్యం కోసం ఈ యువ ప్లేయర్ ఎన్నో కష్టాలను అనుభవించాడు. కార్తీకేయ పడ్డ కష్టాల గురించి అతని కోచ్ సంజయ్ భరద్వాజ్ తెలియజేశాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీకేయకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. రూ.10 బిస్కెట్ ప్యాకెట్ కోసం కార్తీకేయ 10 కిలోమీటర్లు నడిచేవాడని చెప్పాడు. తన అకాడమీలో తొలిసారి భోజనం చేసినప్పుడు వెక్కి వెక్కి ఏడ్చాడని, ఓ ఏడాది పాటు అతను పూర్తిగా మధ్యాహ్న భోజనానికి దూరంగా ఉన్నాడని తెలిపాడు.

క్రికెటర్ కావాలనే లక్ష్యంతో..
ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌కు చెందిన కార్తికేయ క్రికెటర్ కావాలనే లక్ష్యంతో ఇంటి నుంచి ఢిల్లీకి వచ్చేసాడు. తన కోచింగ్ ఫీజులు తండ్రికి భారం కాకుడదనే కార్తీకేయ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఢిల్లీలో తనకు తెలిసిన స్నేహితుడితో అన్ని అకాడమీలు తిరిగాడు. కానీ ఫీజులు ఎక్కువగా ఉండటంతో చేరలేకపోయాడు. భరద్వాజ్ అకాడమీకి వెళ్లినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అయితే భరద్వాజ్.. కార్తీకేయకు ఓ అవకాశం ఇచ్చాడు. నెట్స్‌లో అతనితో బౌలింగ్ చేయించాడు. అతని బౌలింగ్‌కు ఫిదా అయిన భరద్వాజ్ ఫ్రీగా కోచింగ్ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. కోచింగ్ సమస్య తీరినా కార్తీకేయకు ఆహారం, వసతి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో అకాడమీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో నైట్ షిఫ్ట్ ఉద్యోగం చేస్తూ ఉదయం అకాడమీకి వచ్చేవాడు. రూ.10 బిస్కట్ ప్యాకెట్ కొనుక్కోని తినేందుకు అతను 10 కిలోమీటర్లు నడిచేవాడు.

మధ్యప్రదేశ్‌కు పంపించి..
ఈ విషయం తెలుసుకున్న భరద్వాజ్ అతనికి అకాడమీలోనే పనితో పాటు వసతి కల్పించాడు. అయితే తొలిసారి భోజనం పెట్టినప్పుడు కార్తీకేయ వెక్కి వెక్కి ఏడ్చాడని, ఏడాది కాలంగా అతను లంచ్ చేయలేదనే విషయం తనకు అప్పుడే తెలిసిందని భరద్వాజ్ చెప్పుకొచ్చాడు. ఢిల్లీ జట్టు ట్రయల్స్‌లో భరద్వాజ్‌కు చోటు దక్కకపోవడంతో అతన్ని మధ్యప్రదేశ్‌కు పంపించానని చెప్పాడు. అక్కడ డివిజన్ క్రికెట్‌లో సత్తా చాటడంతో రంజీ టీమ్‌లో చోటు దక్కిందని చెప్పాడు. ఐపీఎల్ అరంగేట్రం చేయడంతో క్రికెటర్ కావాలనే అతని కల నెరవేరిందన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications