Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

4 బంతుల్లో 4 వికెట్లు! చరిత్ర సృష్టించిన భారత యువ పేసర్!

భారత యువ క్రికెటర్, మధ్యప్రదేశ్ లెఫ్టార్మ్ పేసర్ కుల్వంత్ కెజ్రోలియా చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో4 బంతుల్లో 4 వికెట్లు తీసాడు. హోల్కర్ స్టేడియం వేదికగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో కుల్వంత్ కెజ్రోలియా ఈ ఫీట్ సాధించాడు. బరోడా సెకండ్ ఇన్నింగ్స్ 95వ ఓవర్‌లో కుల్వంత్ కెజ్రోలియా ఈ ఘనతను అందుకున్నాడు.

ఈ ఓవర్ రెండు, మూడు, నాలుగు, ఐదు బంతులకు వరుసగా షెష్వాత్ రావత్, మహేష్ పీతియా, భార్గవ్ భట్, ఆకాశ్ సింగ్‌లను ఔట్ చేశాడు. షెష్వాత్ రావత్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన కుల్వంత్.. మహేష్ పీతియాను స్లిప్ క్యాచ్‌గా..భార్గవ్ బట్‌ను ఎల్బీగా.. ఆకాశ్ సింగ్‌ను క్లీన్ బౌల్డ్‌గా పెవిలియన్ చేర్చాడు.

 Kulwant Khejroliya becomes third bowler to take four wickets in 4 balls in Ranji Trophy 2024

రంజీ ట్రోఫీ చరిత్రలో 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. శంకర్ సైనీ 1988లో తొలిసారి ఈ ఫీట్ సాధించగా.. 2018 మహమ్మద్ ముధాసర్ ఈ ఘనతను అందుకున్నాడు. తాజాగా కుల్వంత్ కెజ్రోలియా ఈ జాబితాలో చేరాడు. మధ్యప్రదేశ్ తరఫున రంజీ క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించిన మూడో బౌలర్‌గా కూడా కుల్వంత్ కెజ్రోలియా నిలిచాడు.

ఈ జాబితాలో హిరలాల్ గైక్వాడ్(1962-23)లో తొలిసారి హ్యాట్రిక్ సాధించగా.. రవి యాదవ్(2019-20)లో ఈ ఘనతను అందుకున్నాడు. తాజా కుల్వంత్ మూడో స్థానంలో నిలిచాడు. కుల్వంత్ కెజ్రోలియా‌కు సంబంధించిన ఈ రికార్డ్ వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకోగా. . వైరల్‌గా మారింది.


కుల్వంత్ కెజ్రోలియా(5/34) సూపర్ బౌలింగ్‌తో ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ 34 పరుగుల తేడాతో బరోడాపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 454 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బరోడా 132 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఆ జట్టును ఫాలో ఆన్ ఆడించగా.. రెండో ఇన్నింగ్స్‌లో కుల్వంత్ దెబ్బకు 270 పరుగులకు కుప్పకూలింది.
Story first published: Monday, February 12, 2024, 15:59 [IST]
Other articles published on Feb 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+