భారత్‌తో రెండో టెస్ట్‌ను సౌతాఫ్రికా మెరుగ్గా ఆరంభించింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై ఓపికగా ఆడిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 81.5 ఓవర్లలో 6 వికెట్లకు 247 పరుగులు చేసింది. ట్రిస్టన్ స్టబ్స్(112 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 49), టెంబా బవుమా(92 బంతుల్లో 5 ఫోర్లతో 41) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. ఓపెనర్లు ఎయిడెన్ మార్క్‌రమ్(81 బంతుల్లో 5 ఫోర్లతో 38), ర్యాన్ రికెల్టన్(82 బంతుల్లో 5 ఫోర్లతో 35) అద్భుతమైన ఆరంభం అందించారు.
సౌతాఫ్రికా బ్యాటర్ల అద్భుత ప్రదర్శనతో తొలి రెండు సెషన్లలో సౌతాఫ్రికా పూర్తి ఆధిపత్యం చెలాయించగా.. కుల్దీప్ యాదవ్(3/48) గేమ్ ఛేంజ్ బౌలింగ్‌తో ఆఖరి సెషన్‌లో భారత్ పైచేయి సాధించింది. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు. వెలుతురు లేమి కారణంగా మరో 8.1 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే అంపైర్లు ఆటను నిలిపేసారు. రెండో రోజు ఆట ఆరంభంలో వీలైనంత త్వరగా సౌతాఫ్రికాను ఆలౌట్ చేసి భారీ స్కోర్ సాధిస్తేనే ఈ మ్యాచ్‌పై భారత పట్టు సాధిస్తుంది. లేదంటే తొలి టెస్ట్ తరహాలోనే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు ఓపెనర్లు మార్క్‌రమ్, ర్యాన్ రికెల్టన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. అయితే బుమ్రా వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మార్క్‌రమ్ ఇచ్చిన సునాయస స్లిప్ క్యాచ్‌ను కేఎల్ రాహుల్ నేలపాలు చేశాడు. ఈ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకున్నాడు. మరో రెండు రనౌట్ అవకాశాలను కూడా భారత్ చేజార్చుకుంది. ఇక టీ బ్రేక్‌కు ముందు మార్క్‌రమ్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో సౌతాఫ్రికా 82/1 స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లింది.
రెండో సెషన్ ఆరంభంలోనే ర్యాన్ రికెల్టన్‌ను కుల్దీప్ యాదవ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో ట్రిస్టన్ స్టబ్స్, టెంబా బవుమా జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన ఈ జోడీ.. ఓపికగా ఆడుతూ వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. దాంతో సౌతాఫ్రికా 156/2 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.
మూడో సెషన్‌లో భారత బౌలర్లు చెలరేగారు. 84 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన బవుమా-స్టబ్స్ జోడీని జడేజా విడదీసాడు. హాఫ్ సెంచరీకి చేరువైన బవుమాను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే స్టబ్స్‌ను కుల్దీప్ యాదవ్ క్యాచ్ ఔట్ చేసి హాఫ్ సెంచరీ చేయకుండా అడ్డుకున్నాడు. టోనీ డీ జోర్జీ, వియాన్ మల్డర్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేయగా.. కుల్దీప్ యాదవ్ మరోసారి అడ్డుకున్నాడు. మల్డర్(13)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.
కొత్త బంతిని అందుకున్న తర్వాత టోర్నీ డీ జోర్జి(26)ని సిరాజ్ కీపర్ క్యాచ్‌గా ఔట్ చేశాడు. ఆ తర్వాత నాలుగు బంతులకే బ్యాడ్ లైట్ కారణంగా ఆట ఆగిపోయింది. తొలి రెండు సెషన్లలో ఒక్కో వికెట్ మాత్రమే తీసిన భారత్.. ఆఖరి సెషన్‌లో మాత్రం 4 వికెట్లు పడగొట్టింది. ఇందులో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్‌వైపు మలుపు తిప్పాడు.