Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'అతన్ని కలిశాక మైండ్‌ బ్లాక్‌ అయ్యింది.. 10 నిమిషాలు ఏమీ మాట్లాడలేకపోయా'

Kuldeep Yadav recalls his 1st meeting with Shane Warne

ఢిల్లీ: మణికట్టు స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్ టీమిండియాలోకి అరంగేట్రం చేసి దాదాపు మూడేళ్లు అవుతోంది. 2014లో యూఏఈలో జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌‌లో రాణించడంతో బీసీసీఐ సెలక్టర్ల దృష్టిలో పడ్డ కుల్‌దీప్‌.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ ద్వారా టెస్టు అరంగేట్రం చేశాడు. ఆ సమయంలో టీమిండియా కోచ్‌గా ఉన్న అనిల్‌ కుంబ్లే.. కుల్‌దీప్‌ను దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌కు పరిచయం చేశాడు. తాను వార్న్‌ను కలుస్తానంటూ అనిల్‌ భాయ్‌ను కోరి మరీ కలిశాడు. అయితే ఆ రోజు తనకు ఎదురైన అనుభవాల గురించి మణికట్టు మాంత్రికుడు తాజాగా చెప్పుకొచ్చాడు.

 మైండ్‌ బ్లాక్‌ అయ్యింది:

మైండ్‌ బ్లాక్‌ అయ్యింది:

టీవీ ప్రెజెంటర్‌ మడోనా టిక్సియారా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌చాట్‌లో పాల్గొన్న కుల్‌దీప్‌ యాదవ్ మాట్లాడుతూ... 'నేను పుణెలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో షేన్ వార్న్‌ను కలిశా. వార్న్‌ను కలవడం నాకు అదే తొలిసారి. ఆసమయంలో టీమిండియాకు ప్రధాన కోచ్‌గా అనిల్‌ కుంబ్లే భాయ్‌ ఉన్నారు. వార్న్‌ను కలిసి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నట్లు కుంబ్లేకు చెప్పా. ఆ తర్వాత కుంబ్లే సాయంతో వార్న్‌ను కలిశా. అతన్ని‌ కలిశాక మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. మొదటి పది నిమిషాలు ఏమీ మాట్లాడలేకపోయా. ఆ సమయంలో కుంబ్లే-వార్న్‌లు మాట్లాడుకున్నారు' అని తెలిపాడు.

 వార్న్‌ మంచి సలహా ఇచ్చాడు:

వార్న్‌ మంచి సలహా ఇచ్చాడు:

'కుంబ్లే-వార్న్‌లు మాట్లాడుకుంటూ ఉంటే చాలాసేపు అక్కడే నిలబడి విన్నాను. చివరగా నేను మాట్లాడం ఆరంభించా. చాలా విషయాలను వార్న్‌తో పంచుకున్నా. నా భవిష్యత్తు ప్రణాళికలు ఏంటో వార్న్‌కు చెప్పుకొచ్చా. వికెట్‌కు రెండు వైపులా బంతిని ఎలా సంధిస్తాను అనే విషయాన్ని వివరించా. అయితే అంతా విన్న వార్న్‌.. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావ్‌ అని అన్నాడు. కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్‌ తెలిపాడు. బ్యాట్స్‌మన్‌ మదిలో ఏమి ఆలోచిస్తూ ఉండవచ్చు అనే దానిని ఊహిస్తూ బౌలింగ్‌ చేయమని వార్న్‌ సలహా ఇచ్చాడు' అని మణికట్టు స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్ చెప్పాడు.

కోచ్‌లా అన్ని విషయాల్ని విషయాలు చెప్పేవాడు:

కోచ్‌లా అన్ని విషయాల్ని విషయాలు చెప్పేవాడు:

'ఆ టెస్ట్ మ్యాచ్ తర్వాత షేన్ వార్న్‌ను కలిసే అవకాశం చాలాసార్లు వచ్చింది. ఐపీఎల్‌లో కేకేఆర్‌కు ఆడుతుండగా.. వార్న్‌ కామెంటేటర్‌గా ఉన్నాడు. ఆ సమయంలో చాలాసార్లు కలిసే అవకాశం దొరికింది. ఒక కోచ్‌ ఎలా అయితే చెబుతాడో.. అలానే పలు విషయాల్ని వార్న్‌ నాకు చెప్పాడు. అవి నా కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి' అని కుల్‌దీప్‌ చెప్పుకొచ్చాడు. కుల్‌దీప్‌ భారత్ తరపున 6 టెస్టులు, 60 వన్డేలు, 21 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 167 వికెట్లు పడగొట్టాడు.

హార్దిక్ వర్కౌట్ వీడియో.. స్వేదం చిందిస్తూ.. (వీడియో)

Story first published: Thursday, August 13, 2020, 17:58 [IST]
Other articles published on Aug 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+