న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హార్దిక్ వర్కౌట్ వీడియో.. స్వేదం చిందిస్తూ.. (వీడియో)

Hardik Pandya working hard on his fitness ahead of IPL 2020 in UAE

ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 13వ సీజన్‌ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. సుదీర్ఘ కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న హార్దిక్‌.. మళ్లీ బరిలోకి దిగి పూర్వపు ఫామ్‌ను అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. వెన్నుగాయం కారణంగా జట్టుకు దూరమైన హార్దిక్‌.. క్రికెట్‌ బరిలోకి దిగి చాలాకాలమే అయ్యింది. వెన్నుగాయానికి శస్త్ర చికిత్స చేయించుకుని కోలుకున్న తర్వాత దేశవాళీ టోర్నీల్లో దుమ్మురేపి పునరాగమనం ఖాయమనుకున్న తరుణంలో కరోనా వైరస్ కారణంగా మొత్తం టోర్నీలన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు ఐపీఎల్‌కు రంగం సిద్ధమైంది.

కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2020 యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం కానుంది. దీంతో హార్దిక్‌ పాండ్యా ఐపీఎల్‌కు ఉత్సాహంగా సిద్ధమవుతున్నాడు. విపరీతంగా కసరత్తులు చేస్తున్నాడు. బరువులు ఎత్తుతూ స్వేదం చిందిస్తున్నాడు. షర్ట్ లేకుండా వ్యాయామం చేస్తున్నాడు. తన కసరత్తులకు సంబంధించిన వీడియోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. 'ప్రతీ ఇంచ్‌.. ప్రతీ రిపిటీషన్‌.. అన్నీ లెక్కలోకి వస్తాయి' అని కాప్షన్ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌కు మాజీ క్రికెటర్‌ మునాఫ్‌ పటేల్‌, ఆసీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ లిన్‌ పాండ్యాను అభినందించారు.

ముంబై ఇండియన్స్‌ విజయాల్లో హార్దిక్ ‌పాండ్యాది కీలక పాత్ర. ఎప్పుడు క్రీజులోకి వచ్చినా బ్యాటు, బంతితో జట్టును ఆదుకుంటాడు. కేవలం పది నిమిషాల్లోనే మ్యాచ్‌ను మలుపుతిప్పేస్తాడు. బౌలర్‌ ఎంతటివాడైనా కళ్లు చెదిరే సిక్సర్లు, అద్భుతమైన బౌండరీలు బాదేస్తూ స్కోరు బోర్డును పరుగులెత్తిస్తాడు. ఇక బంతితోనూ వికెట్లు నెలకూల్చుతాడు. జట్టుకు అవసరమైన సమయాల్లో వికెట్లు తీస్తాడు. అందుకే ముంబైకి ప్రధాన ఆటగాడు అయ్యాడు. గుజరాత్‌కు చెందిన 26 ఏళ్ల హార్దిక్‌ పాండ్యా 2016లో భారత్‌ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. సంప్రదాయక ఫార్మాట్‌లో 532, 50 ఓవర్ల ఫార్మాట్‌లో 957, పొట్టి క్రికెట్‌లో 310 పరుగులు చేశాడు.

2018లో వెన్నుగాయం బారిన పడిన హార్దిక్‌ పాండ్యా గతేడాది దానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. రీఎంట్రీ ఫిట్‌నెస్‌ పరీక్షల్లో భాగంగా దేశవాళీ మ్యాచ్‌ల్లో (డీవై పాటిల్) చెలరేగిపోయిన హార్దిక్‌.. ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగి సత్తాచాటాలనుకుంటున్నాడు. వెన్నుగాయం కారణంగా హార్దిక్ టెస్టు ఫార్మాట్‌ ఆడాలా లేక పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడాలా అనే డైలమాలో ఉన్నాడు‌. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కీలక ఆటగాడైన హార్దిక్‌.. టెస్టు క్రికెట్‌ను వదిలేయాలనే ఉద్దేశం ఉన్నటు కనబడుతోంది. ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ఎక్కువ దృష్టి సారిస్తానని పాండ్యా తెలిపాడు. తనకున్న ప్రధాన బలం ఎనర్జీనేనని, అన్ని ఫార్మాట్లు ఆడితే తన ఆటను బ్యాలెన్స్‌ చేసుకోవడం కష్టమవుతుందన్నాడు.

IPL 2020: చెన్నై ఫిట్‌నెస్‌ క్యాంప్‌కు జడేజా దూరం!!IPL 2020: చెన్నై ఫిట్‌నెస్‌ క్యాంప్‌కు జడేజా దూరం!!

Story first published: Thursday, August 13, 2020, 16:40 [IST]
Other articles published on Aug 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X