Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ శర్మతో కుల్దీప్ యాదవ్ వాగ్వాదం.. ఎందుకంటే?(వీడియో)

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో కుల్దీప్ యాదవ్ వాగ్వాదానికి దిగాడు. సౌతాఫ్రికాతో వైజాగ్ వేదికగా శనివారం జరిగిన ఆఖరి వన్డేలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఓ డీఆర్‌ఎస్ విషయంలో కుల్దీప్ యాదవ్.. రోహిత్ శర్మతో వాగ్వాదానికి దిగాడు. డీఆర్‌ఎస్ తీసుకోవాలని పట్టుబట్టాడు. కానీ రోహిత్ శర్మ మాత్రం వెనక్కి వెళ్లు అంటూ మందలించాడు.

కుల్దీప్ యాదవ్ వేసిన 43వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతి లుంగి ఎంగిడి ప్యాడ్స్‌కు తాకగా కుల్దీప్ యాదవ్ ఎల్బీ కోసం అప్పీల్ చేశాడు. అంపైర్లు పట్టించుకోకపోవడంతో రివ్యూ తీసుకోవాలని రాహుల్‌ను కోరాడు. వెంటనే రోహిత్ శర్మ వెనక్కి వెళ్లిపోవాలంటూ సీరియస్‌గా చెప్పాడు. అతని సూచనలతో వెనుదిరిగిన కుల్దీప్ యాదవ్.. డీఆర్‌ఎస్ తీసుకోవాలని వాగ్వాదానికి దిగాడు. ఆఖరి బంతికి కూడా అప్పీల్ చేసిన కుల్దీప్ రివ్యూ తీసుకోవాలని మరోసారి పట్టుబట్టాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. ఈ సరదా సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సౌతాఫ్రికా ఇన్నింగ్స్ అనంతరం రోహిత్ శర్మతో వాగ్వాదం గురించి ప్రశ్నించగా.. అందుకు గల కారణాన్ని కుల్దీప్ యాదవ్ వెల్లడించాడు. 'డీఆర్‌ఎస్ విషయంలో నేను ఎప్పుడూ తప్పులు చేస్తుంటాను. అందుకే రోహిత్ ఎప్పుడూ నన్ను ఆటపట్టిస్తుంటాడు. బంతి ప్యాడ్ తగిలితే వికెట్‌గానే భావిస్తాను. అయితే మా కెప్టెన్ కేఎల్ రాహుల్ డీఆర్‌ఎస్‌ విషయంలో కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటాడు. వికెట్ కీపర్‌గా అది ఔటా? నాటౌటా అనేది పసిగడుతాడు. డీఆర్‌ఎస్ విషయంలో ఒక బౌలర్‌గా ప్రతీ నాటౌట్ కూడా ఔట్ అనే భావన కలుగుతోంది. కాబట్టి మనల్ని కాస్త శాంత పర్చేందుకు రోహిత్ శర్మ వంటి వ్యక్తులు ఉండాలి.'అని కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

Kuldeep Yadav Explains Light-Hearted Banter with Rohit Sharma During IND vs SA 3rd ODI

ఇక తన బౌలింగ్ గురించి మాట్లాడుతూ.. 'మా బౌలర్లు అద్భుతంగా ఆరంభించారు. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా తొలి 7-8 ఓవర్లు కట్టడిగా బౌలింగ్ చేశారు. ఆ తర్వాత స్పిన్నర్లు రాణించారు. నిజానికి పిచ్‌పై కొద్ది గ్రిప్ దొరికింది. పేస్‌లో వేరియేషన్ చూపిస్తూ బౌలింగ్ చేశాం. డ్రై బాల్‌లో బౌలింగ్ చేయడం అదృష్టమే. మేం వరుసగా 20 టాస్‌లు ఓడిపోయాం. 21వ మ్యాచ్‌లో గెలిచాం. అందుకు సంతోషంగా ఉంది.

పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. కొత్త రూల్ ప్రకారం 34 ఓవర్ల తర్వాత పాత బంతిని అనుమతిస్తుండటంతో బౌలర్లకు కలిసొస్తుంది. నా బౌలింగ్‌లో నేను వేరియేషన్స్ చూపించాను. స్క్రాంబుల్డ్ సీమ్, లెగ్ స్పిన్, గూగ్లీ, ఫ్లిప్పర్ వేసాను. బౌలింగ్‌లో వైవిధ్యం చూపించడానికి ప్రయత్నించాను.'అని కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, December 6, 2025, 18:45 [IST]
Other articles published on Dec 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+