Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్థాన్‌లో ఆడాలని ఉంది: కుల్దీప్ యాదవ్

భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అనుమతిస్తే పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతామని టీమిండియా వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఈ టోర్నీ జరగనుండగా.. తమ మ్యాచ్‌లను తటస్థ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ కోరుతోంది. తమ ఆటగాళ్లకు అక్కడ భద్రత ఉండదని, పాకిస్థాన్‌‌లో పర్యటించమని స్పష్టం చేసింది.

మరోవైపు పాకిస్థాన్‌కు వెళ్లేందుకు భారత ప్రభుత్వం కూడా అనుమతిచ్చే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్‌లో ఆడాలని ఉందని కుల్దీప్ యాదవ్ చెప్పడం చర్చనీయాంశమైంది. 'క్రికెటర్లుగా మమ్మల్ని ఎక్కడికి పంపినా వెళ్లి ఆడటానికి సిద్ధంగా ఉంటాం. అది మా బాధ్యత. ఇంతకు ముందెన్నడూ పాకిస్థాన్ వెళ్లి ఆడలేదు. అవకాశం వస్తే మాత్రం తప్పకుండా వెళ్లి ఆడుతాను.'అని కుల్దీప్ యాదవ్ ఓ ఈవెంట్‌లో చెప్పుకొచ్చాడు.

Kuldeep Yadav Excited to Pakistan Visit for Champions Trophy 2025 Amid Political Uncertainty

మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీని రీషెడ్యూల్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఖండించింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పీసీబీ కరాచీ, గడాఫీ, రావల్పిండి స్టేడియాలను ఆధునీకరిస్తోంది. ఈ క్రమంలో టోర్నీని రీషెడ్యూల్ చేస్తున్నట్లు అక్కడి మీడియా పేర్కొంది. అయితే ఈ వార్తలను పీసీబీ ఛైర్మన్ నఖ్వీ ఖండించాడు. షెడ్యూల్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగుతుందన్నారు.

Story first published: Tuesday, August 27, 2024, 19:33 [IST]
Other articles published on Aug 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+