బీసీసీఐ సెక్రటరీ జై షాపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్లు.. క్రికెట్ దిగ్గజం అంటూ అమిత్ షాకు చురకలు!

హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెక్రటరీ జై షాపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. క్రికెట్‌కు ఏ మాత్రం సంబంధం లేని జై షా.. బీసీసీఐలో ఎలా ఆధిపత్యం చెలాయిస్తున్నారని, ఉన్నత పదవిలో కొనసాగుతున్నారని తనదైన శైలిలో ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణకు వచ్చిన జై షా తండ్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కేటీఆర్ తనదైన శైలిలో చురకలంటించారు. మునుగోడు బహిరంగ సభలో పాల్గొనేందుకు అమిత్ షా రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాజకీయంగా అమిత్ షాను విమర్శించే క్రమంలో బీసీసీఐ సెక్రటరీ జై షా పేరును కేటీఆర్ ప్రస్తావించారు.
అంచెలంచెలుగా ఎదిగి..
ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. 'కేవలం తన ప్రతిభ ఆధారంగా అంచెలంచెలుగా ఎదిగి భారతీయ క్రికెట్ బోర్డ్ బీసీసీఐ కార్యదర్శి పదవిలో ఉన్న ఓ 'ప్రముఖ క్రికెటర్ తండ్రి'ఈరోజు తెలంగాణకు వస్తున్నారు. ఓ సోదరుడు ఎంపీ, భార్య ఎమ్మెల్సీగా గతంలో పోటీ చేసిన నేపథ్యాన్ని కలిగిన ఓ పెద్దమనిషి తరపున ప్రచారం చేస్తారు. టీఆర్‌ఎస్‌ది కుటుంబ పాలన అంటూ ఉపన్యాసం దంచుతారు'అని అమిత్ షా, రాజగోపాల్‌రెడ్డి కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఫిఫాకు పట్టిన గతే..
భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్‌పై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా) నిషేధం విధించిన నేపథ్యంలో క్రీడల్లో రాజకీయ నాయకుల ప్రమేయంపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే కేటీఆర్ ట్వీట్‌కు ప్రాధాన్యత లభిస్తోంది. ఆటలతో ఏ మాత్రం సబంధం లేని వారు క్రీడా సంఘాల్లో జోక్యం చేసుకోవం, పెత్తనం చెలాయించడం ఇకనైనా ఆపేయాలని క్రీడా అభిమానులు కోరుతున్నారు. లేకుంటే ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్‌ఎఫ్)కు పట్టిన గతే పడుతుందని హెచ్చరిస్తున్నారు.

జై షాకు సెక్రటరీ పదవి ఎలా..?
ఇక కేటీఆర్ సందేహించనట్లుగా ఏమాత్రం క్రికెట్‌కు సంబంధం లేని జై షా బీసీసీఐలో అత్యంత కీలకపదవి అయిన సెక్రటరీ పదవి ఎలా అందుకున్నాడనే ప్రశ్న సగటు క్రికెట్ అభిమాని మదిలో మెదులుతుంది. కేవలం జై షా పలుకుబడి కారణంగా ఈ పదవి దక్కిందనేది చాలా మంది అభిప్రాయం. ఇక బీసీసీఐలో పూర్తి పెత్తనం జై షాదేననే ప్రచారం చాలా రోజులుగా ఉంది. ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఉన్నది పేరుకేనని, కీలక నిర్ణయాలన్నీ కేవలం జై షావేనని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడానికి కారణం కూడా జై షానేనని అభిప్రాయం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications