
న్యూఢిల్లీ: డిసిషన్ రివ్యూ సిస్టమ్(డీఆర్ఎస్) విషయంలో వికెట్ కీపర్‌గా తాను ఎంతో ఉత్తమమని కెప్టెన్ రోహిత్ శర్మ మెచ్చుకున్నాడని టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్ అన్నాడు. కెప్టెన్‌గా తనకు అండగా నిలిచాడని కూడా చెప్పాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన భరత్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా.. ఢిల్లీ టెస్ట్‌లో భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. వికెట్ కీపర్‌గా చురుకుగా ఉంటూ.. డీఆర్‌ఎస్ నిర్ణయాల్లో రోహిత్‌కు అండగా నిలిచాడు.
ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ కోసం ఇండోర్‌కు వచ్చిన కేఎస్ భరత్.. మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. 'డీఆర్‌ఎస్‌లను నువ్వు అద్భుతంగా జడ్జ్ చేస్తున్నావని రోహిత్ భాయ్ కితాబిచ్చాడు. ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని సూచించాడు. ఢిల్లీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో నువ్వు ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వెళ్తావని చెప్పాడు. అప్పటికే ఆస్ట్రేలియా కుప్పకూలింది. జట్టు విజయ లాంఛనాన్ని పూర్తి చేయాడానికి సిద్దమయ్యాను. క్రీజులోకి అడుగుపెట్టగానే పరుగులు చేయడంపై ఫోకస్ పెట్టాను. ఒక ప్లేయర్‌గా అవకాశం తలుపు తట్టేంత వరకు ఓపికగా ఎదురుచూశాను.
ఇక భారత పిచ్‌లపై ఆడటం పెద్ద కష్టమేం కాదు. షాట్ ఎంపిక అనేది చాలా కీలకం. షాట్ సెలక్షన్ సరిగ్గా ఉంటే పరుగులు వాటంతట అవే వస్తాయి. భారత పిచ్‌లపై రాణించాలంటే డిఫెన్స్‌ను నమ్ముకోవడం చాలా ముఖ్యం'అని భరత్ చెప్పుకొచ్చాడు. రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో కేఎస్ భరత్‌కు అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని తెలుగు క్రికెటర్ రెండు చేతులతో అందిపుచ్చుకున్నాడు.
ఢిల్లీ టెస్టులో 23 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచిన భరత్.. పూజారాతో కలిసి జట్టును గెలిపించాడు. అటాకింగ్ గేమ్‌తో 3 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. వరుసగా రెండు టెస్ట్‌లు గెలిచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రిటైన్ చేసుకున్న టీమిండియా.. బుధవారం నుంచి ఇండోర్ వేదికగా ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌లో అమీతుమీ తేల్చుకోనుంది.