టాలీవుడ్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవిని టీమిండియా స్టార్ క్రికెటర్, తెలుగు తేజం కేఎస్ భరత్ మర్యాదపూర్వకంగా కలిసాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్‌లోనే ఉన్న కేఎస్ భరత్.. సోమవారం మధ్యాహ్నం చిరంజీవి నివాసానికి వెళ్లాడు. సుమారు అరగంట పాటు అక్కడే గడిపారు. ఈ సందర్భంగా తన టెస్ట్ జెర్సీని మెగా స్టార్ చిరంజీవికి బహుమతిగా అందజేశాడు.
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డుకు నామినేట్ అయిన నేపథ్యంలో ఆయన ఇంటికి సందర్శకుల తాకిడి పెరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు, వ్యాపారవేత్తలు చిరంజీవిని కలిసి అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ వికెట్ కీపర్ అయిన కేఎస్ భరత్ మెగాస్టార్‌ను కలిసినట్లు తెలుస్తోంది.

చాలా రోజులుగా తన అభిమాన హీరో అయిన చిరంజీవిని కలవాలని కేఎస్ భరత్ అనుకున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ నాలుగు రోజుల్లోనే ముగియడంతో ఐదో రోజు అయిన సోమవారం కేఎస్ భరత్‌కు కావాల్సిన సమయం దొరికింది. దాంతో చిరంజీవిని కలిసి ఆయన అభినందనలు తెలిపారు.
ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను కేఎస్ భరత్, చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో కేఎస్ భరత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అశ్విన్‌తో కలిసి జట్టుకు విజయాన్ని అందించే ప్రయత్నం చేశాడు. విశాఖపట్నంకు చెందిన కేఎస్ భరత్.. రిషభ్ పంత్ గైర్హాజరీలతో టీమిండియా ప్రధాన వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు.
ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్ విశాఖపట్నం వేదికగా జరగనుంది. వైజాగ్ కేఎస్ భరత్‌కు హోమ్ గ్రౌండ్. శుక్రవారం నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో కేఎస్ భరత్ సత్తా చాటాల్సి అవసరం ఉంది. లేకుంటే భారత జట్టులో అతని చోటు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. అవకాశం కోసం ధ్రువ్ జురెల్ కాచుకొని కూర్చున్నాడు.
ప్రస్తుతం చిరంజీవి.. తన కొత్త సినిమా విశ్వంభర షూటింగ్‌లో ఉన్నారు. ఆయన నటిస్తోన్న ఈ సినిమా సెట్స్‌పై ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. పాన్ ఇండియాగా తెరకెక్కుతోంది