Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Krunal Pandya సంచలన నిర్ణయం.. సెలెక్టర్ల తీరు నచ్చక గుడ్ బై చెప్పేశాడు!

 Krunal Pandya steps down as Baroda captain

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో బరోడా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కృనాల్.. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు బరోడా క్రికెట్‌ అసోసియేషన్‌(బీసీఏ) అధ్యక్షుడు ప్రణశ్‌ అమిన్‌కు శుక్రవారం కృనాల్ ఇ- మెయిల్ చేశాడు. కేవలం కెప్టెన్సీ నుంచే తప్పుకుంటున్నానని, ఆటగాడిగా కొనసాగుతానని కృనాల్ స్పష్టం చేశాడు. అయితే తన కెప్టెన్సీ రాజీనామాకు గల కారణాన్ని మాత్రం కృనాల్ వెల్లడించలేదు. కానీ దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ‌ జట్టు ఎంపిక విషయంలో సెలెక్టర్లతో కృనాల్‌కు విభేదాలు వచ్చినట్లు బరోడా క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.

సెలెక్టర్లతో విభేధాలు..

సెలెక్టర్లతో విభేధాలు..

కృనాల్‌ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా సెలెక్టర్లు ఏకపక్షంగా వ్యవహరించారని, దాంతో బాగా హర్ట్ అయిన అతను ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.

'బరోడా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా. ప్రస్తుత దేశవాళీ సీజన్‌లో కెప్టెన్‌గా కొనసాగబోను. అయితే, సెలక్షన్‌కు మాత్రం అందుబాటులో ఉంటాను. జట్టు కోసం ఆడతాను. ఆటగాడిగా బరోడా క్రికెట్‌ కోసం నా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు ప్రయత్నిస్తాను. జట్టు ప్రయోజనాల కోసం నా వంతు కృషి చేస్తాను. ఎల్లప్పుడూ జట్టు మెరుగైన ప్రదర్శన కోసం పాటుపడతాను'అని కృనాల్‌ పాండ్యా బరోడా క్రికెట్ అసోసియేషన్‌కు చేసిన మెయిల్‌లో పేర్కొన్నాడు.

చిత్తుగా ఓడి..

చిత్తుగా ఓడి..

కాగా ఇటీవల ముగిసిన ముస్తాక్‌ అలీ ట్రోఫీలో కృనాల్‌ సారథ్యంలోని బరోడా జట్టు దారుణంగా విఫలమైంది. ఐదింట కేవలం ఒక మ్యాచ్‌ మాత్రమే గెలిచి గ్రూపు-బిలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఇక ఆటగాడిగా కూడా కృనాల్‌ పాండ్యా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. టోర్నీ మొత్తంలో కేవలం 87 పరుగులు మాత్రమే చేశాడు. 5.94 ఎకానమీతో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. జట్టు ఎంపిక విషయంలో కృనాల్‌ తనకు నచ్చిన ఆటగాళ్ల వైపే మొగ్గు చూపాడంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా విఫలమవ్వడంతో కూడా కెప్టెన్సీ వదులుకునేలా చేసినట్లు తెలుస్లోంది.

చాంపియన్ తమిళనాడు..

చాంపియన్ తమిళనాడు..

కృనాల్‌ కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పడంతో.. బీసీఏ కేదార్‌ దేవ్‌ధర్‌కు పగ్గాలు అప్పగించే యోచనలో బరోడా క్రికెట్ అసొసియేషన్ ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది తమిళనాడు ఈ దేశవాళీ టోర్నీ టైటిల్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్‌లో షారూఖ్ ఖాన్ సూపర్ సిక్స్‌తో ఆఖరి బంతికి కర్ణాటకను ఓడించి మూడోసారి ట్రోఫీని గెలిచింది. ఇక కృనాల్‌ విషయానికొస్తే.. టీ20ల ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ ముంబై ఇండియన్స్‌ ఆటగాడు... ఈ ఏడాది మార్చిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌తో వన్డేల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

శ్రీలంక పర్యటనలో చివరిసారిగా ఆడిన కృనాల్ కరోనా బారిన పడటంతో జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2021 సెకండాఫ్ ఆడిన పెద్దగా రాణించలేదు.

Story first published: Saturday, November 27, 2021, 14:33 [IST]
Other articles published on Nov 27, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+