తమ్ముడూ.. చాలా మంది నీ పని అయిపోయిందన్నారు.. రా! కృనాల్ పాండ్యా భావోద్వేగం!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్‌ను హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ గెలుచుకోవడంతో అతని సోదరుడు, లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా భావోద్వేగానికి గురయ్యాడు. తమ్ముడి విజయం నేపథ్యంలో తన సోదరుడు పడ్డ కష్టాలను గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్ ముందు హార్దిక్ పాండ్యా వరుస గాయాలతో సతమతమవుతూ.. టీమిండియాలో చోటు కూడా కోల్పోయాడు. దాంతో అతని పనై పోయిందని అంతా అనుకున్నారు. గుజరాత్ టైటాన్స్ అతన్ని కెప్టెన్‌గా నియమించుకోవడాన్ని కూడా తప్పుబట్టారు. ఏ స్థాయి క్రికెట్‌లో కెప్టెన్సీ చేసిన అనుభవం లేని హార్దిక్ పాండ్యాను సారథిగా నియమించడం పిచ్చి నిర్ణయమని విమర్శించారు.
ఆటతోనే బదులు..
కానీ ఈ విమర్శలకు హార్దిక్ తన ఆటతోనే బదులిచ్చాడు. కెప్టెన్‌గా సత్తా చాటడంతో పాటు వ్యక్తిగత ప్రదర్శనతో అదరగొట్టి టైటిల్ అందించాడు. తాను జీరో కాదని.. అవకాశమిస్తే టీమిండియాకు కూడా సారథ్యం వహించగలిగే సత్తా ఉందని నిరూపించాడు. ఈ క్రమంలోనే అతని సోదరుడు కృనాల్ పాండ్యా విమర్శకులను ఉద్దేశించి ట్వీటర్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చాడు. 'తమ్ముడూ.. నీ విజయం వెనుక దాగి ఉన్న కష్టం ఏంటో నీకు మాత్రమే తెలుసు. వేకువజామునే ఎన్నో గంటలు శ్రమించావు. ట్రైనింగ్, క్రమశిక్షణ, మానసికంగా దృఢత్వం.. ఇవన్నీ నీ విజయానికి సోపానాలు.. ఇప్పుడు నువ్వు ట్రోఫీని ఎత్తుతుంటే అదంతా నీ కష్టానికి దొరికిన ప్రతిఫలంగా అనిపిస్తున్నది.

నీ పనైపోయిందన్నవారికి..
నువ్వు ఈ విజయానికి వంద శాతం అర్హుడవు. చాలా మంది నీ పని అయిపోయిందని.. నువ్వు ఆటకు పనికిరావని అన్నారు. కానీ నువ్వు వారిని తప్పని రుజువు చేయడంతో పాటు నీ చరిత్ర రాసుకునేలా చేశావ్. నీ పేరును లక్షలాది మంది ప్రజలు జపిస్తుండగా నేను అక్కడ ఉన్నాను. నీ విజయాన్ని కళ్లారా చూశాను..'అని కృనాల్ ఏమోషనల్‌గా రాసుకొచ్చాడు. ఐపీఎల్ లో సుమారు ఐదేళ్ల పాటు ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన హార్ధిక్ పాండ్యా-కృనాల్ పాండ్యాలు ఈ సీజన్ లో మాత్రం రెండు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున బరిలోకి దిగారు.

నేలకు కొట్టిన బంతిలా..
హార్ధిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్ గా వ్యవహరించగా.. కృనాల్ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఆడాడు. ఈ సీజన్ కు ముందు గాయాల బారిన పడ్డ హార్ధిక్.. గతేడాది టీ20 ప్రపంచకప్ లో పెద్దగా రాణించకపోవడంతో భారత జట్టులో చోటు కోల్పోయాడు. దాంతో ముంబై ఇండియన్స్ సైతం హార్దిక్ పాండ్యాను వదిలేసింది. దీంతో హార్ధిక్ కెరీర్ ముగిసినట్టేనని అనుకున్నారంతా. కానీ పాండ్యా మాత్రం గోడకు కొట్టిన బంతిలా ఎగిరి తన సత్తా ఏంటో చూపించాడు.

487 పరుగులతో..
ఈ సీజన్‌లో బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణించి తనలో ఆల్ రౌండర్ ఇంకా అలాగే ఉన్నాడని నిరూపించాడు. ముఖ్యంగా రాజస్తాన్ రాయల్స్‌తో ముగిసిన ఫైనల్స్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో 34 పరుగులు చేశాడు. ఇక ఈ సీజన్‌లో 14 ఇన్నింగ్స్ ల్లో 487 పరుగులు కూడా చేసి గుజరాత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications