IPL 2026: హార్దిక్ X కృనాల్.. పాండ్యా బ్రదర్స్ మధ్య విభేదాలు? (వీడియో)
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా మధ్య విభేదాలు తలెత్తయ్యా? రామ-లక్ష్మణుడిలా కలిసుండే ఈ అన్నదమ్ముల మధ్య గొడవలు మొదలయ్యాయా? అంటే సోషల్ మీడియా వేదికగా అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఇద్దరూ మాట్లాడుకోకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. అంతేకాకుండా హార్దిక్ పాండ్యాకు కృనాల్ పాండ్యా కోపంగా బౌన్సర్ సంధించడం, దానికి హార్దిక్ సీరియస్‌గా రియాక్ట్ అవ్వడం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది.

ఒకరికొకరు చూసుకోలేదు..
హార్దిక్ పాండ్యా ఔటైనప్పుడు కృనాల్ పాండ్యా గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకోవడం, మ్యాచ్ అనంతరం ఇద్దరూ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోకపోవడం ఈ ఇద్దరి మధ్య మాటల్లేవనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ మ్యాచ్ అసాంతం ఇద్దరూ కనీసం ఒకరినొకరు చూసుకోలేదు. ఒకప్పుడు ఇద్దరూ కలిసి ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఆధిపత్యం కనబర్చిన ఈ ఇద్దరూ ఇప్పుడు గొడవపడుతున్నారనే విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
నటాషా స్టాంకోవిచ్‌తో విడాకుల అనంతరం హార్దిక్ పాండ్యా.. మహికా శర్మతో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. కుటుంబానికి దూరంగా మహికా శర్మతో కలిసి హార్దిక్ ఉంటున్నాడు. ఈ విషయంలోనే హార్దిక్, కృనాల్ పాండ్యాకు విభేదాలు తలెత్తాయా? లేక ఆస్థి తగాదాలా? అనే విషయం తెలియాల్సి ఉంది. కుటుంబాన్ని వదిలేసి పూర్తిగా మహికా శర్మతో హార్దిక్ పాండ్యా తిరగడం నచ్చకనే కృనాల్ దూరంగా ఉంటున్నాడా? అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఐపీఎల్‌లో కృనాల్ పాండ్యా ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్‌సీబీ వరుస విజయాలతో జోరు మీద ఉంటే.. హార్దిక్ పాండ్యా సారంథ్యంలోని ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ పరాజయాలతో చతికిల పడింది. ఆదివారం ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో ఆర్‌సీబీనే విజయం వరించింది.
ఆర్‌సీబీ ఘన విజయం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 240 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78), విరాట్ కోహ్లీ(38 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 50), రజత్ పటీదార్(20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. టీమ్ డేవిడ్(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 నాటౌట్) ధాటిగా ఆడాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.
అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 222 పరుగులే చేసి ఓటమిపాలైంది. షెర్ఫెన్ రూథర్ ఫోర్డ్(31 బంతుల్లో ఫోర్, 9 సిక్స్‌లతో 71 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. హార్దిక్ పాండ్యా(23 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 40),ర్యాన్ రికెల్టన్(22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37), సూర్యకుమార్ యాదవ్(22 బంతుల్లో 5 ఫోర్లతో 33) పర్వాలేదనిపించారు. ఆర్‌సీబీ బౌలర్లలో సుయాష్ శర్మ(2/47) రెండు వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా, జాకోబ్ డఫీ, రసిక్ సలామ్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications