Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కృనాల్ పాండ్యా అరంగేట్రం.. తమ్ముడి చేతుల మీదుగా క్యాప్.. తండ్రిని తలుచుకొని భావోద్వేగం! (వీడియో)

Krunal Pandya gets emotional after receiving maiden ODI cap, pays tribute to father

పుణె: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌తో భారత్ తరఫున ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ కృనాల్ పాండ్యా అరంగేట్రం చేశాడు. ఇప్పటికే టీమిండియా తరఫున టీ20 క్రికెట్ ఆడిన కృనాల్ తొలిసారి వన్డే అవకాశాన్ని అందుకున్నాడు. అతనితో పాటు ప్రసిధ్ కృష్ట కూడా అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతనికిదే తొలి మ్యాచ్. ఇక మ్యాచ్‌కు ముందు కృనాల్ తన తమ్ముడు హార్దిక్ పాండ్యా చేతుల మీదు 233వ వన్డే క్యాప్ అందుకోగా.. రవిశాస్త్రి చేతుల మీదు ప్రసిధ్ 234 క్యాప్ అందుకున్నాడు.

కృనాల్ భావోద్వేగం..

అయితే తమ్ముడి చేతుల మీదు క్యాప్ అందుకున్న కృనాల్ తన తండ్రిని తలుచుకొని భావోద్వేగానికి గురయ్యాడు. అతను కన్నీరు పెట్టుకున్న వీడియోను బీసీసీఐ ట్వీట్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటీవలే పాండ్యా బ్రదర్స్ తండ్రి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. భార‌త్ నుండి ఇర్ఫాన్ ప‌ఠాన్, యూసుఫ్ ప‌ఠాన్ ల త‌ర్వాత ఒకేసారి జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న అన్న‌ద‌మ్ములుగా కృనాల్-హ‌ర్ధిక్ పాండ్యాలు నిలిచారు. ‌

భారత్‌దే బ్యాటింగ్..

భారత్‌దే బ్యాటింగ్..

టెస్టు, టీ20 సిరీస్‌లను దక్కించుకుని జోరుమీదున్న టీమిండియా వన్డే సిరీస్‌పై కన్నేసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పుణెలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగింది. టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విఫలమైన బెంచ్‌కు పరిమితమైన ధావన్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కింది. కేఎల్ రాహుల్ కూడా చోటు దక్కించుకోగా.. పంత్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

రోహిత్ ఔట్..

రోహిత్ ఔట్..

ఇక ఇన్నింగ్స్‌ను ధావన్-రోహిత్ ఆరంభించగా భారత్‌కు శుభారంభం దక్కింది. పిచ్‌పై లభిస్తున్న సహకారంతో ఇంగ్లండ్ పేసర్లు చెలరేగగా భారత ఓపెనర్లు ఓపికగా ఆడారు. మంచి బంతులను గౌరవిస్తూ నిదానంగా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. దాంతో పవర్ ప్లే ముగిసే సమాయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 39 పరుగులే చేసింది. ఆ తర్వాత ఇద్దరూ ఓపెనర్లు ధాటిగా ఆడారు. ఈ క్రమంలో రోహిత్(28).. స్టోక్స్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 64 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం క్రీజులో శిఖర్ ధావన్(35 బ్యాటింగ్), విరాట్ కోహ్లీ(7 బ్యాటింగ్) ఉన్నారు.

Story first published: Tuesday, March 23, 2021, 15:23 [IST]
Other articles published on Mar 23, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+