ఎమోషనల్ అయిన కృనాల్:
అర్థ సెంచరీ పూర్తి చేసిన వెంటనే కృనాల్ పాండ్యా చాలా ఎమోషనల్ అయ్యాడు. గాల్లోకి బ్యాట్ చూపిస్తూ తన తండ్రికి అంకితమిస్తున్నట్లు సైగ చేశాడు. అలాగే ఛాతీపై ఉన్న టీమిండియా సింబల్‌ను చూపిస్తూ గర్జించాడు. ఆపై సహచర ఆటగాడు కేఎల్ రాహుల్‌తో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత తన తమ్ముడు హార్ధిక్ పాండ్యాను కౌగిలించుకుని చాలా ఎమోషనల్ అయ్యాడు. అన్న హాఫ్ సెంచరీ చేసినప్పుడు కూడా హార్ధిక్ నవ్వుతూ కనిపించాడు.

ఈ ఇన్నింగ్స్ నాన్నకు అంకితం:
భారత ఇన్నింగ్స్ తర్వాత మీడియాతో మాట్లాడే సమయంలో కూడా కృనాల్ పాండ్యా కన్నీళ్లు పెట్టుకున్నాడు. 'ఈ ఇన్నింగ్స్ నాన్నకు అంకితం' అని చెప్పాడు. ఆ తర్వాత తన తండ్రి గుర్తుకురావడంతో వెక్కివెక్కి ఏడ్చాడు. ఇక మాట్లాడలేకపోయిన కృనాల్.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ట్రోఫీ సమయంలో పాండ్యా బ్రదర్స్ తండ్రి హిమాన్షు పాండ్యా అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.

తమ్ముడు చేతుల మీదుగా వన్డే క్యాప్:
ఇప్పటికే టీమిండియా తరఫున టీ20 క్రికెట్ ఆడిన కృనాల్ పాండ్యా.. ఈరోజు తొలిసారి వన్డే అవకాశాన్ని అందుకున్నాడు. మ్యాచ్‌కు ముందు కృనాల్ తన తమ్ముడు హార్దిక్ పాండ్యా చేతుల మీదుగా 233వ వన్డే క్యాప్ అందుకున్నాడు. అయితే తమ్ముడి చేతుల మీదు క్యాప్ అందుకున్న కృనాల్ తన తండ్రిని తలుచుకొని భావోద్వేగానికి గురయ్యాడు. అతను కన్నీరు పెట్టుకున్న వీడియోను బీసీసీఐ ట్వీట్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారత్ నుంచి ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్‌ల తర్వాత ఒకేసారి జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అన్నదమ్ములుగా కృనాల్-హర్ధిక్ పాండ్యాలు నిలిచారు.

రెండో బ్యాట్స్‌మెన్‌గా:
ఆరంగ్రేటం వన్డే మ్యాచ్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ అందుకున్న ప్లేయర్‌గా కృనాల్ పాండ్యా రికార్డు క్రియేట్ చేశాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన కృనాల్.. ఆరంగ్రేటం మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 2009లో ఆరంగ్రేటం చేసిన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 60 పరుగులతో టాప్‌లో ఉన్నాడు. 1997లో ఆరంగ్రేటం చేసిన సాబా కరీమ్ (55) మూడో స్థానంలో నిలిచాడు.
ధావన్ సెంచరీ మిస్.. కృనాల్ మెరుపు హాఫ్ సెంచరీ! ఫామ్ అందుకున్న రాహుల్! ఇంగ్లండ్‌కు భారీ లక్ష్యం!


Click it and Unblock the Notifications
