
మంచి ఆరంభమే:
ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు మంచి ఆరంభమే దక్కింది. సీనియర్ ఓపెనర్లు రోహిత్ శర్మ (28' 42 బంతుల్లో 4 ఫోర్లు), శిఖర్ ధావన్ ఆచితూచి ఆడారు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. చెత్త బంతులను బౌండరీలు తరలిస్తూ పరుగులు చేశారు. ఈ క్రమంలో రోహిత్, ధావన్ తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించారు. అయితే బెన్ స్టోక్స్ వేసిన 16వ ఓవర్ తొలి బంతికి రోహిత్ ఔటయ్యాడు. వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని ఆడడంతో.. బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తీసుకొని కీపర్ చేతుల్లో పడింది. దీంతో భారత్ 64 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.

కోహ్లీ ఫిఫ్టీ:
రోహిత్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ధావన్‌కు జత కలిసిన కోహ్లీ వేగంగా పరుగులు చేసే ప్రయత్నం చేశాడు. ఓ జీవనాధారం లభించిన గబ్బర్.. బౌండరీలతో అలరించాడు. ఈ క్రమంలోనే ధావన్ అర్ధ శతకం సాధించాడు. స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన గబ్బర్.. హాఫ్ సెంచరీ చేశాడు. 68 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ఫిఫ్టీ మార్క్ చేరుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ధావన్ ఇంగ్లీష్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. మరోవైపు కోహ్లీ తన స్టంన్నింగ్ ఫామ్‌ను కొనసాగిస్తూ 50 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో కెరీర్‌లో 62వ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు.

గబ్బర్ సెంచరీ మిస్:
హాఫ్ సెంచరీ అనంతరం మార్క్ వుడ్ బౌలింగ్‌లో మొయిన్ అలీ క్యాచ్ పట్టడంతో కోహ్లీ పెవిలియన్‌కు చేరాడు. సబ్‌స్టిట్యూట్ ఆటగాడు లివింగ్‌స్టోన్ క్యాచ్ పట్టడంతో శ్రేయస్ అయ్యర్ (9 బంతుల్లో 6; ఫోర్) కూడా త్వరగానే ఔట్ అయ్యాడు. 68 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కును చేరుకున్న ధావన్.. సెంచరీ ముందు తడబడ్డాడు. స్టోక్స్ బౌలింగ్లో మోర్గాన్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో గబ్బర్ పెవిలియన్ బాటపట్టాడు. 106 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 98 పరుగులు చేశాడు. ఈ సమయంలో కేఎల్ రాహుల్ కూడా ఆచితూచి ఆడాడు.

కృనాల్ మెరుపు హాఫ్ సెంచరీ:
ధావన్ అనంతరం క్రీజులోకి వచ్చిన కృనాల్ పాండ్యా వేగంగా పరుగులు చేశాడు. కృనాల్ వరుస బౌండరీలతో హోరెత్తించాడు. కృనాల్ ధాటికి టీమిండియా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. మరోవైపు రాహుల్ కూడా వేగంగా ఆడాడు. కృనాల్ భారీ షాట్లు ఆడి 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఏ అరంగేట్రం ఆటగాడు కూడా ఇంత వేగంగా ఆడలేదు. ఆ కాసేపటికే రాహుల్ కూడా అర్ధ శతకం అందుకున్నాడు. ఇద్దరూ చివరి ఓవర్లలో వేగంగా పరుగులు చేసి భారత్ స్కోరును 300 దాటించారు. ఓ దశలో భారత్ 250 పరుగులు చేయడం కూడా కష్టం అనుకున్నారు అందరూ. అయితే రాహుల్, కృనాల్ సెంచరీ భాగస్వామ్యంతో భర్త ఏకంగా 317 పరుగులు చేసింది.
India vs England: ప్చ్.. త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్న ధావన్!! భారత్ స్కోర్ 250/5!


Click it and Unblock the Notifications












