Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Krunal Pandya: నావల్లనే ప్రాబ్లమైతే ఎల్లిపోతరా ఈడికెంచి..!

Krunal Pandya after he tests positive
Krunal Pandya COVID Positive Trolls | Oneindia Telugu

హైదరాబాద్: శ్రీలంక పర్యటనలోని భారత క్రికెట్‌ జట్టులో కరోనా కలకలం చోటు చేసుకుంది. టీమ్‌ ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా మంగళవారం కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. రెండో టి20 మరికొన్ని గంటల్లో ఆరంభమవుతుందనగా కృనాల్‌కు కోవిడ్‌-19 అని తేలడంతో మ్యాచ్‌ నేటి(బుధవారం)కి వాయిదా పడింది. ఈ మేరకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జైషా ఒక ప్రకటన ద్వారా తెలిపారు. కృనాల్‌ ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నాడు. దాంతో అతడు సిరీస్‌లో మిగిలిన రెండు టీ20లకు దూరమయ్యాడు.

కృనాల్‌తో ఎనిమిది మంది క్రికెటర్లు సన్నిహితంగా మెలిగినట్లు భారత మెడికల్‌ టీమ్‌ గుర్తించింది. వీరికి ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్‌గా రిపోర్టు వచ్చింది. అయితే ఐసోలేషన్ కారణంగా వీరు కూడా మిగిలిన రెండు మ్యాచులకు దూరం కానున్నారు. ఇక కృనాల్‌కు కరోనా రావడంపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.

శిఖర్ ధావన్‌తో సహా..

కృనాల్‌కు సన్నిహితంగా ఉన్న ఆటగాళ్లలో కెప్టెన్ కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా ఉన్నాడు. ధావన్ మిగతా టీ20ల నుంచి తప్పుకున్నాడు. దీంతో భువనేశ్వర్ కుమార్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ధావన్‌తో పాటు పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, కృష్ణప్ప గౌతమ్, యుజ్వేంద్ర చహల్, శిఖర్ ధావన్, మనీష్ పాండేలు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. దాంతో తదుపరి రెండు మ్యాచ్‌లకు ఈ ఇద్దరు దూరం కానున్నారు. ఈ క్రమంలోనే కృనాల్‌పై నెటిజన్స్ సెటైర్లు పేల్చుతున్నారు. 'నావల్లనే ప్రాబ్లమైతే ఎల్లిపోతరా ఈడికెంచి'అని సినిమా డైలాగ్‌తో ట్రోల్ చేస్తున్నారు.

కృనాల్ నీ వల్ల మాచాన్స్ పోయింది కదరా!

కృనాల్‌కు పాజిటివ్‌ రావడం ఇంగ్లండ్‌కు వెళ్లాల్సిన సూర్యకుమార్‌ యాదవ్‌, పృథ్వీ షా పైనా ప్రభావం పడనుంది. బుడగ నుంచి బుడగకు బదిలీ జరిగితే క్వారంటైన్‌ అవసరం లేదు. నేరుగా కోహ్లీసేనతో కలవచ్చు. మరిప్పుడు బుడగలోనే వైరస్‌ రావడంతో సూర్య, షా పరిస్థితి ఏంటన్నది అర్థం కావడం లేదు. పైగా ఈ ఇద్దరు కృనాల్‌తో సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఒరేయ్ కృనాల్.. నీ వల్ల మాకు టెస్ట్ క్రికెట్ ఆడే చాన్స్ పోయింది కదరా? అని షా, సూర్య అంటున్న మీమ్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

ఫస్ట్‌టైమ్ ‘పాజిటీవ్’..

ఇక కృనాల్ విషయంలో తొలిసారి పాజిటీవ్ అనే పదం వింటున్నానని, కాకపోతే అది కూడా నెగటీవ్ విషయంలోనని మరో అభిమాని కామెంట్ చేశాడు. ఇక మైదానంలో కృనాల్ అతిగా ప్రవర్తిస్తుంటాడు. అతని తీరును నెటిజన్లు ఇప్పటికే చాలా సార్లు తప్పుబట్టారు. బ్యాటింగ్ చేసేటప్పుడు అతను ప్రదర్శించే హావభావాలు, అతి సంబరాలు అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తాయి. ఈ క్రమంలోనే అతనిపై దుమ్మెత్తిపోస్తుంటారు. అయితే కృనాల్ పాండ్యాకు కరోనా రావాడాన్ని కూడా నెటిజన్లు వ్యతిరేకార్థంలో విమర్శిస్తున్నారు. ఒంటిచేత్తో కృనాల్ సిరీస్‌ను నాశనం చేశాడని, ఇక ఈ సిరీస్ జరగడం కష్టమేనని కామెంట్ చేస్తున్నారు. ఇక వన్డే సిరీస్ సందర్భంగా ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను కౌగిలించుకోవడాన్ని ప్రస్తావిస్తూ కూడా సెటైర్లు పేల్చుతున్నారు. శ్రీలంక ఆటగాళ్లకు కూడా కరోనా రావచ్చని కామెంట్ చేస్తున్నారు.

దీపక్ హుడా క్షుద్ర పూజలు..

బరోడా మాజీ కెప్టెన్, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ దీపక్ హుడా క్షుద్ర పూజలు చేయడంతోనే కృనాల్ పాండ్యాకు కరోనా వైరస్ వచ్చిందని కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫన్నీ మీమ్స్‌ను సైతం షేర్ చేస్తున్నారు. దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముందు కృనాల్ పాండ్యా, దీపక్ హుడా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బరోడా టీమ్ కెప్టెన్ అయిన కృనాల్ పాండ్యా అకార‌ణంగా త‌న‌పై నోరు పారేసుకున్నాడ‌ని.. టీమ్ స‌భ్యులు, ఇత‌ర టీమ్స్ ముందు త‌నను అవమానపరిచాడని వైస్ కెప్టెన్ దీప‌క్ హుడా సంచలన ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా తాను జట్టును వీడుతున్నట్లు కూడా ప్రకటించాడు. ఈ వివాదం భారత క్రికెట్‌లో పెనుదుమారం సృష్టించడంతో విచారణ చేపట్టిన బరోడా క్రికెట్ అసోసియేషన్(బీసీఏ) తప్పు దీపక్ హుడాదేనని తేల్చి అతన్ని టీమ్ నుంచి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత దీపక్ హుడా బరోడా టీమ్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ క్రమంలోనే కృనాల్‌కు సంబంధించిన ఏ విషయంలోనైనా దీపక్ హుడాను నెటిజన్లు ప్రస్తావిస్తుంటారు.

Story first published: Wednesday, July 28, 2021, 15:49 [IST]
Other articles published on Jul 28, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+