IPL 2022: పాపం కృష్ణప్ప గౌతమ్.. అప్పుడు రూ. 9.25 కోట్లు.. ఇప్పుడు 90 లక్షలు!

బెంగళూరు: ఐపీఎల్ మెగా వేలంలో స్టార్ ఆటగాళ్లు జీరో కావడం.. అనామక ప్లేయర్లు హీరో కావడం మాములే. గతేడాది జాక్ పాట్ ధరతో అందరి దృష్టిని ఆకర్షించిన కృష్ణప్ప గౌతమ్ ఈ సారి మాత్రం అగ్గువకే అమ్ముడయ్యాడు. ఒక్క ఏడాదిలోనే అతని విలువ ఆకాశం నుంచి అట్టడుగుకు పడిపోయింది. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన భారత అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా గతేడాది గౌతమ్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. స్పిన్ ఆల్‌రౌండర్ అయిన కృష్ణప్ప గౌతమ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.9.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్‌లో అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.

ఆసక్తికనబర్చిన ఫ్రాంచైజీలు..
అంతేకాకుండా ఈ ఏడాది జరిగిన దేశవాళీ క్రికెట్ టోర్నీల్లోనూ అతను అంతంత మాత్రమే రాణించాడు. దాంతో తాజా వేలంలో రూ.50 లక్షల కనీస ధరతో కృష్ణప్ప గౌతమ్ కోసం ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. రెండో రోజు వేలంలో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మినహా మరే ఫ్రాంచైజీ అతని కోసం పోటీపడలేదు . ఫ్రాంచైజీల పర్స్ మనీ తక్కువ అవడంతో ఆచి తూచి వేలం పాడుతున్నాయి. చివరకు లక్నో 90 లక్షలు వెచ్చించి కృష్ణప్ప గౌతమ్‌ను సొంతం చేసుకుంది.

టైమ్ బాబు.. టైమ్.. అంతే..
కాగా గతంలో రూ. 9.25కోట్లు అందుకున్న గౌతమ్ ఇప్పుడు 90 లక్షలకే అమ్ముడుపోవడంపై నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. టైమ్ ఇలానే ఉంటుందని, ఏది శాశ్వతం కాదనడానికి ఇదే నిదర్శనమని సూచిస్తున్నారు. ఎప్పుడూ ఒకేలా ఉండాలని చెబుతున్నారు. ''అప్పుడు లక్కీగా భారీ ధర. తర్వాత టీమిండియా తరఫున అరంగేట్రం... ఇప్పుడు కూడా పర్లేదు. నీకు ఇది మంచి ధరే'' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

టీమిండియా తరఫున..
శ్రీలంక పర్యటనకు వెళ్లిన శిఖర్ ధావన్ నేతృత్వంలోని టీమిండియా బీ టీమ్ తరఫున కృష్ణప్ప గౌతమ్ వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 2018లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన ఈ కర్ణాటక ఆల్‌రౌండర్ ఆ సీజన్ వెగా వేలంలో 2 కోట్లు పలికాడు. 2019 సీజన్ మినీ వేలంలో 6.20 కోట్లు, 2021 మినీ వేలంలో రూ. 9.25 కోట్లు పలికాడు. ఈ సారి రూ.90 లక్షలకే అమ్ముడుపోయాడు. ఇప్పటి వరకు 24 మ్యాచ్‌లు ఆడిన గౌతమ్.. 13 వికెట్లు తీసి 186 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications