Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2025: ఆ 35 ఏళ్ల ఆర్‌సీబీ బౌలర్‌ను తీసుకోండి: మాజీ క్రికెటర్

ఆసియా కప్ 2025 బరిలోకి దిగే భారత జట్టును మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టు ఎంపికపై అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోవడంతో ఏ ఆటగాళ్లకు అవకాశం దక్కుతుందా? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

జస్‌పీత్ర్ బుమ్రా, శుభ్‌మన్ గిల్‌లను ఎంపిక చేయాలని కొందరంటే.. మరికొందరు వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ నేపథ్యంలో విశ్రాంతి ఇవ్వాలని కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్‌లో సత్తా చాటిన శ్రేయస్ అయ్యర్, సాయి సుదర్శన్‌లను ఎంపిక చేయాలని మరికొందరు కోరుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్.. భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భువనేశ్వర్ కుమార్ మెరుగైన ప్రదర్శన చేశాడని గుర్తు చేశాడు.

Kris Srikkanth Urges Selectors to Pick Bhuvneshwar Kumar for Asia Cup 2025

భువీని తీసుకోవాలి..

'ఆసియా కప్ జట్టులోకి భువనేశ్వర్ కుమార్ తీసుకోవాలి. ఎందుకంటే అతను అద్భుతంగా రాణిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో అతని విఫలమైనప్పటికీ అంతకు ముందు తర్వాత మెరుగ్గా రాణించాడు. ఆ సెమీఫైనల్ తర్వాత భువనేశ్వర్ కుమార్ మళ్లీ టీమిండియాకు ఆడలేదు. కానీ ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేశాడు. సెలెక్టర్లు అతన్ని ఎందుకు పట్టించుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదు. కొత్త బంతితో భువీ అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. అతని బౌలింగ్‌ను సీరియస్‌గా చూడాలి. అప్పుడే అతని సామర్థ్యం అర్థమవుతుంది.'అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.

టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్లో చివరిసారిగా భారత్ తరఫున ఆడిన భువనేశ్వర్ కుమార్..ఇప్పటి వరకు 87 మ్యాచ్‌ల్లో 6.96 ఎకానమీతో 90 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ కింగ్స్ తరఫున జరిగిన ఫైనల్లో 38 పరుగులిచ్చి రెండు కీలకమైన వికెట్లు తీసాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 190 మ్యాచ్‌లు ఆడి 198 వికెట్లు తీసాడు. అతని రికార్డ్స్‌ను గుర్తు చేసిన క్రిష్ శ్రీకాంత్.. భారత జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సిరాజ్‌కే చోటు..

ఆసియా కప్ 2025లో ప్రసిధ్ కృష్ణ కంటే సిరాజ్‌‌కే చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శ్రీకాంత్ అన్నారు. 'జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఖచ్చితంగా జట్టులో ఉంటారు. మూడో పేసర్‌గా ప్రసిధ్ కృష్ణ కంటే సిరాజ్‌కే చోటు దక్కుతుందనేది నా నమ్మకం. సిరాజ్‌కు పోరాడే తత్వం ఉంది. ప్రసిధ్ ఐపీఎల్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ అదనపు మీడియం పేసర్‌గా సిరాజ్‌ను తీసుకోవాలి. ప్రస్తుతం సిరాజ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. నేనైతే సిరాజ్‌నే ఎంచుకుంటా.'అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.

Story first published: Monday, August 18, 2025, 15:15 [IST]
Other articles published on Aug 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+