For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అభిషేక్.. గుడ్డిగా ఆడకు.. ఈ ప్రపంచం క్రూరమైనది: శ్రీకాంత్

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో పేలవ ఫామ్‌‌తో ఇబ్బంది పడుతున్న టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక సలహా ఇచ్చాడు. కాస్త ఉరుకులాట తగ్గించి పిచ్ కండిషన్స్‌ను అర్థం చేసుకోవాలని హితవు పలికాడు. ప్రతీ బంతిని సిక్సర్ బాదాలనే ఆలోచనను పక్కన పెట్టాలని సూచించాడు. తన సహచర ఓపెనర్ ఇషాన్ కిషన్ తరహాలో క్రీజులో సెట్ అయ్యేందుకు టైమ్ తీస్కోవాలని సలహా ఇచ్చాడు.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ బ్యాటర్ అభిషేక్ శర్మ.. అనూహ్యంగా విఫలమవుతున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన అతను మూడు మ్యాచ్‌ల్లోనూ డకౌటయ్యాడు. పాకిస్తాన్, నెదర్లాండ్స్‌తో జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లో అతను స్పిన్నర్ల బౌలింగ్‌లో బ్యాట్‌ను గుడ్డిగా ఊపి మూల్యం చెల్లించుకున్నాడు. ఈ క్రమంలోనే అతని బ్యాటింగ్‌పై తీవ్ర చర్చ జరుగుతుంది. సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్రీజులోకి రాగానే తొలి బంతి నుంచే భారీ షాట్లు ఆడాలనే ఆతృతే అభిషేక్ శర్మ కొంపముంచుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అభిషేక్.. ఉరుకులాట తగ్గించు..

ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ బ్యాటింగ్‌పై క్రిష్ శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ విలువైన సలహాలు ఇచ్చాడు. ఈ క్రీడా ప్రపంచం చాలా క్రూరమైనదని, బాగా ఆడితే ప్రశంసిస్తారనే, విఫలమైతే తిట్టని తిట్లు తిడుతారని హెచ్చరించాడు. 'రెండు మ్యాచ్‌ల్లో వరుసగా డకౌట్ అయినప్పుడు తర్వాతి మ్యాచ్‌లో కనీసం రెండు బంతుల్ని నెమ్మదిగా ఎదుర్కోవాలి. పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోవడంలో తప్పు లేదు. అభిషేక్ శర్మ.. వరుసగా డకౌట్ అవుతున్నాడు అంటే అతనిలో ఏదో సమస్య ఉందని అర్థం. దానిని అతనే ఆత్మపరిశీలన చేసుకొని సరిదిద్దుకోవాలి.

అలా అని అభిషేక్ తన సహజసిద్ధమైన ఆటను మార్చుకోవాలని నేను చెప్పడం లేదు. కానీ ఆరంభంలో కాస్త సమయం తీసుకోని ఆడమని చెబుతున్నా. మైదానంలో మనసు నియంత్రణలో లేనప్పుడే.. అనవసరంగా బంతి దిశకు అడ్డంగా షాట్ ఆడటానికి ప్రయత్నిస్తాం. నెదర్లాండ్స్‌తో అభిషేక్ జౌటైన తీరు అతను తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. అభిషేక్.. తన సహచర ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను చూసి నేర్చుకోవాలి. కిషన్ క్రీజులో సెట్ అయ్యేందుకు సమయం తీసుకొని ఆ తర్వాత షాట్స్ ఆడుతున్నాడు. అభిషేక్ కూడా ఇషాన్‌ను అనుసరించాలి.

Kris Srikkanth Urges Abhishek Sharma to Show Patience After Unwanted Hat-trick of Ducks in T20 World Cup 2026

ఈ ప్రపంచం క్రూరమైనది

అసలు అభిషేక్.. ఎందుకు అన్ని బంతులను స్టేడియం బయటకు కొట్టడానికి ప్రయత్నిస్తున్నావు? క్రీజులో నిలబడి నాలుగు బంతులను డిఫెండ్ చేయడంలో తప్పులేదు. ఒక ఆటగాడిగా అభిషేక్ కొన్ని వ్యక్తిగత మార్పులు చేసుకోవాలి.

ఈ క్రీడా ప్రపంచం చాలా క్రూరమైనది. బాగా ఆడినప్పుడు పొగిడే జనాలు.. ఇలాంటి వైఫల్యాల సమయంలో తీవ్రంగా విమర్శిస్తారు.’అని క్రిష్ శ్రీకాంత్ హెచ్చరించాడు.

అమెరికాతో తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన అభిషేక్ శర్మ అనారోగ్యంతో నమీబియాతో మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చినా.. డకౌట్ అయ్యాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లోనే తన డకౌట్ వైఫల్యాన్ని కొనసాగించాడు. మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనా టీమ్ మేనేజ్‌మెంట్ అభిషేక్ శర్మకు అండగా నిలుస్తోంది. అతని ఫామ్‌పై ఎలాంటి ఆందోళన లేదని కెప్టెన్ సూర్య స్పష్టం చేశాడు. టీమ్‌మేనేజ్‌మెంట్ అండగా ఉన్నప్పటికీ.. ఇదే వైఫల్యాన్ని కొనసాగిస్తే.. అతని కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది.

Story first published: Sunday, February 22, 2026, 16:41 [IST]
Other articles published on Feb 22, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+